మిర్చిమసాలా

బయటే బెటర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో మాట్లాడేందుకు అవకాశం రాని ప్రతిపక్షపార్టీల సభ్యులు ‘మీడియా పాయింట్’లో మా ట్లాడేందుకు తహతహలాడుతుంటారు. మీడియా పాయింట్‌లో మా ట్లాడితే అక్షరం పొల్లుపోకుండా ఎలక్ట్రానిక్, ప్రిం ట్ మీడియా ద్వా రా తమ అభిప్రాయా లు జనానికి చేరతాయన్నది వారి ఆశ. సభలోపల మాట్లాడితే- ఇక ఆపేయండని చైర్మన్, స్పీకర్ అస్తమానం బెల్ కొడుతుంటారు. మీడియాపాయింట్‌లో ఈ గొడవలేవీ ఉండవు. పైగా టివి చానళ్లు ప్రత్యక్షప్రసారం చేస్తుంటాయి. అందుకే ‘సభలోపల మాట్లాడేకన్నా, బయట మాట్లాడటం మిన్న’ అన్న నిర్ణయానికి వారు వచ్చేశారు. అందుకే మీడియాపాయింట్ వద్ద ‘నేతల’ రష్ పెరిగిపోయింది.
- పి.వి.రమణారావు

నేనన్నదే నిజం
గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాఖ్యం అబద్ధం అని తేల్చినా ఐదు నిమిషాల్లో రాజీనామాకు సిద్ధమని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ప్రకటించగానే టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘అబద్ధం అని నేను నిరూపిస్తాను’ అని చెప్పగానే మీడియా ఆసక్తి చూపించింది. ఇంటింటికి మంచినీటిని అందిస్తామని 2016 ప్రసంగంలో గవర్నర్ చెప్పారు. ఇప్పటి వరకు సగం గ్రామాలకు కూడా ఇవ్వలేదంటే అబద్ధం చెప్పినట్టే కదా? అని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నిజానికి సగం గ్రామాలు కాదు పావు సగం గ్రామాలకు కూడా ఇంకా ఇంటింటికి మంచినీటి పథకం అమలు కాలేదు. 2019 ఎన్నికల నాటికి పూర్తి చేస్తాం అనేది టిఆర్‌ఎస్ హామీ, అన్ని గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. రేవంత్ అబద్ధాన్ని విన్న విలేఖరులు- ‘ఇంకా నయం.. కెసిఆర్ 15 నిమిషాల్లో ముగిస్తానని చెప్పి పది నిమిషాలు మాట్లాడారు.. ఇదే అబద్ధం అని చెప్పాల్సింది’ అని వ్యాఖ్యానించారు.
- మురళి

మాట తూలితే..
కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు, నోరు జారితే కష్టం. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు విద్యుత్ శాఖ సిబ్బందితో కటువుగా మాట్లాడి అభాసుపాలయ్యారు. ఏపి ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా జిల్లాలో ఒక బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి హుటావుటిన ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆయన అధికారులతో కటువుగా మాట్లాడి ఉండాల్సి కాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమైంది. దీని వల్ల బస్సు ఘటన మరుగునపడిందనే భావన కలిగింది. ఇది అసెంబ్లీ కాలం. రెండు రాష్ట్రాల్లో సభా సమావేశాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ఆవేశంగా మాట్లాడినా, పదజాలం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, బెడిసికొట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.. - వెల్జాల చంద్రశేఖర్

సర్వేలు.. మంత్రాలు..!
మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే ఎవరైనా నవ్వుతారు. ఎన్నికలు జరిగినప్పుడు నిర్వహించే సర్వేలు కూడా అలాగే ఉంటాయన్నారు సిఎల్‌పి నేత కె. జానారెడ్డి. ప్రజల నాడి పట్టుకోవడం కష్టమన్నారు. అయితే ఎక్కడైనా పొరపాటున సర్వే చెప్పినట్లే ఫలితాలు వెల్లడైతే, చూశారా తమ సర్వే నిజమైందని భుజాలు ఎగురవేస్తారు. మంత్రగాడు చింత చెట్టు కింద కూర్చొని మంత్రం వేస్తున్న సమయంలోనే, గాలికి నాలుగైదు చింత కాయలు రాలితే అది తన గొప్పతనమేనని గొప్పలు చెబుతాడని అన్నారు. సర్వేలూ అటువంటి కోవకు చెందినవేనని ఆయన చమత్కరించారు. అందుకే తాను వాటిని విశ్వసించనని చెప్పారు.

శభాష్.. తెలంగాణ పోలీస్
తెలంగాణ పోలీసులు తమ చాతుర్యం, సాహసం, భాషాపటిమ, సమయస్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలు ఎక్కడున్నా ఇట్టే పసిగట్టేస్తున్నారు. అటు వామపక్ష తీవ్రవాదులు, ఇటు మతోన్మాద ఉగ్రవాదుల ఉనికిని కనిపెట్టడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సమాచారం అందించి, కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ డిజిపికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆధునిక టెక్నాలజీని ఆకళింపుచేసుకుని అమలుచేయడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారు. గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సేవలు నేరగాళ్లను హడలెత్తిస్తున్నాయి.
- శైలేంద్ర
-వి. ఈశ్వర్ రెడ్డి