మిర్చిమసాలా

మీడియానా మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డ్రగ్స్’కు బానిసలైన కొంతమంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా చేసిన హ డావుడికి తెలుగు సినీ రంగం ఒక్కసారిగా విలవిల్లాడిపోయిం ది. తమ కనుసన్నలలో నడుచుకునే సినీ జర్నలిజానికి, మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి మధ్య ఉండే తేడా ఏంటో మీడియా రుచి చూపించింది. జర్నలిస్టులు అంటే సినిమాల్లో చూపించే విధంగా చెప్పింది రాసుకుపోయే వారు కాదని తెలిసొచ్చేలా చేసింది. దీంతో కంగుతిన్న కొందరు నటీనటులు- ‘డ్రగ్స్ వాడేవారు ఎందరో ఉండగా మమ్మల్నే టార్గెట్ చేస్తారా?’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మీడియా అంటే సినిమాల్లో వలే ఉండదని సినీ సెలబ్రిటీలకు అనుభవమై తత్త్వం బోధపడి ఉంటుంది!
- వెల్జాల చంద్రశేఖర్
కొత్త ఒక వింత!
జీవితాలకు సంబంధించే కాదు, ఇపుడు సినిమాలకు సంబంధించి కూడా ‘శతం’ అనే పదం అదృశ్యమైపోయింది. తాజాగా రాజకీయ రంగంలోకి ఈ పదం వచ్చి చేరింది. ఆధునిక యుగంలో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నూరేళ్లు (శతం) జీవించేవారి సంఖ్య తగ్గుతోంది. చలనచిత్ర రంగంలో ‘శత దినోత్సవాల’ సందడి ఇపుడు ఎక్కడా కానరావడం లేదు. ఇక రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఎక్కువ కాలం ఉంటారో తెలియని తరుణంలో సరిగ్గా వందరోజుల క్రితం చంద్రబాబు మంత్రివర్గంలో చేరిన నారా లోకేష్, జవహర్, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు అనుచరులు ‘శతదినోత్సవ సంబరాలు’ ఘనంగా నిర్వహించడం పాతతరం వారికి కొత్తగా కనిపిస్తోంది!
- నిమ్మరాజు చలపతిరావు

రాజకీయాల్లో కర్ణుడేడి?
యుగాలు మారినా విశ్వసనీయతకు కర్ణుడే నిదర్శనం. ద్రౌపదికి వస్త్రాపహరణం చేయాలని దుర్యోధనుడు ఆదేశించినా, సోదరులలైన పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వనని తెగేసి చెప్పినా కర్ణుడు మాత్రం దుర్యోధనుడి పక్షానే చివరి వరకు నిలబడ్డాడు. తనకు కష్టకాలంలో అండగా నిలబడినందుకు దుర్యోధనుడికి కర్ణుడు జీవితాంతం అండగా ఉ న్నాడు. అందుకే విశ్వసనీయత అంటే కర్ణుడిని గుర్తుపెట్టుకుం టాం. ఉత్తరాదిన క ర్ణుడి పేరు పెట్టుకునే వాళ్లు కోకొల్లలు. ప్రతి వీధిలో కరణ్ పేరు పెట్టుకునేవాళ్లు కనపడుతారు. ఇక రామాయణంలో రావణుడి, కుంభకర్ణుడి రహస్యాలను శ్రీరాముడికి చెప్పి, మంచి కార్యం కోసం పాటుపడినప్పటికీ విభీషణుడిని జనం హర్షించలేదు. భారతీయ సమాజంలో విశ్వసనీయతకు ఉన్నంత విలువ మరోదానికి లేదు. సమకాలీన రాజకీయపార్టీల్లో విశ్వసనీయత ఉన్న వ్యక్తులను కాగడా వేసి వెదికినా కనిపించడం లేదు.
- శైలేంద్ర

జాబితాల కలకలం
అర్ధరాత్రి దాటిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే అభ్యర్థుల జాబితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూడటం పరిపాటే. ఈ మధ్య గ్యాంగ్‌స్టర్ నరుూమ్ కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన వెంట కొంతమంది రాజకీయ ప్రముఖులున్నారని మీడియాలో రావడంతో ఎవరు పేరు వెలుగుచూస్తుందోనని నేతలకు ముచ్చెమటలు పోశాయి. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో తొలి జాబితా ఇదిగో అదిగో అని మొత్తం మీద 14 మంది సినీ ప్రముఖుల పేర్లు వెలుగు చూశాయి. హమ్మయ్య మన పేరులేదు అనుకున్న వారికి సైతం నిద్ర లేకుండా రెండో జాబితా వస్తోందంట...ఖేల్ కతమ్ కాలేదు.. దుకాణ్ బంద్ కాలేదు...
-బివి ప్రసాద్

నోరు తెరిస్తే ‘జైలు’!
తెలంగాణలో టిడిపి నేత రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే, టిఆర్‌ఎస్ నేతలు ‘గయ్’మంటూ లేస్తున్నారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ, రేవంత్ జైలుకెళ్ళారంటూ వారు మండిపడుతున్నారు. ఏపిలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శిస్తే, వెంటనే అధికార టిడిపి నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ జైలుకెళ్ళడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ విపక్షాల నేతలపై అధికార పార్టీల నాయకులు ‘జైలు జీవితాన్ని’ గుర్తు చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. రాజకీయం అంటే అదే మరీ!.
- వి. ఈశ్వర్ రెడ్డి