Others

ఈత కల్లు రుచి చూపిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు వచ్చే విదేశీ అతిథులకు తెలంగాణ వంటకాల రుచి చూపించినట్టే ఈ ప్రాంత మద్యం రుచిని చూపించాలని కల్లు గీత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేవలం తెలంగాణ వంటకాల రుచేనా ఇక్కడి మద్యం రుచిని వారికి చూపించరా? అని కల్లు గీత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఈత కల్లు ప్రసిద్ధి, దీనిని మద్యంగా చూడవద్దని, ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులను నయం చేసే గొప్ప ఆయుర్వేద ఔషధమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. దీంతో గీత కార్మికులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు వచ్చే అతిథులకు ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటలో ఏర్పాటు చేసే విందులో ఈత కల్లును పెట్టించాలని కోరారు.
-వెల్జాల చంద్రశేఖర్
ఇవాంకా...సంగీత
నిన్న మొన్నటి దాకా ఇవాంక అంటే ఎవరికీ తెలియదు. శే్వత సౌథాధిపతి ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఇవాంకా బాల్యం, ఆమె హాబీలు, జీవన శైలిపై వీడియో క్లిప్పింగ్‌లతో పోటీలుపడి టీవీ చానళ్లు కుమ్మేస్తున్నాయి. వార్తలు లేక అల్లాడుతున్న 24 గంటల వార్తల టీవీ చానళ్లు ఇవాంకపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇవాంకాకు నిజంగా ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యం చెందుతారేమో. ఆమె గురించి భారీ కథనాలు అవసరమా అనిపిస్తుంది. గ్లామర్‌గా కనపడడం, ఫోటోజెనిక్ ముఖం కావడంతో టీవీలు ఆమెకు సంబంధించిన అంశాలను విరగబడి ప్రసారం చేస్తున్నాయి. జనానికి మొహం మొత్తుతుందేమోనని మధ్య మధ్యలో మృగాళ్ల ఆగడాలకు బలై హక్కుల, ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేస్తున్న మహిళలపై కూడా వాస్తవ కథనాలను గంటల కొద్దీ ప్రసారం చేశాయి. ఇవాంక వల్ల దేశానికి పెట్టుబడులు వస్తాయా, పారిశ్రామికవేత్తల సమావేశం వల్ల మనదేశానికి వచ్చే లాభం సంగతి పక్కనపెడితే, ఈ వారం టీవీలను ఇవాంక, సంగీత డామినేట్ చేశారని చెప్పవచ్చు.
-శైలేంద్ర
ఎదురుదాడి!
గ్యాంగ్‌స్టార్ నరుూం భూము ల సంగతేమిటి? అంటూ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చిర్రెత్తింది. నరుూం భూములు ఏమిటి?, నరుూం భూములు అనేవి ఉంటాయా?, నరుూం పేరిట వేరుగా భూముల జాబితా ఉంటుందా? అని ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు. నరుూం అనే వ్యక్తి ప్రజల భూములను లాక్కున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెడతామని అన్నారు. నరుూం లాంటి నరరూప రాక్షసులను పెంచి పోషించింది ఎవరు? సృష్టించింది ఎవరు? అంటూ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను నిలదీయడంతో వారు గతుక్కుమన్నారు. నరుూం భూములు అన్నందుకు ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ పడ్డారు.
-వి.ఈశ్వర్‌రెడ్డి

మీకో నమస్కారం!
శాసనసభలో సమాధానాల కోసం విపక్ష సభ్యులు అధికారపక్షంపై రకరకాలుగా ఒత్తిడి తీసుకువస్తుంటారు. సమాధానం చెప్పమని పట్టుబడుతుంటారు, ఒక్కో మారు మంత్రుల సమాధానంతో సంతృప్తి చెందలేదని పేర్కొంటూ సభ నుండి వాకౌట్ చేస్తుంటారు. చాలావరకూ ప్రశ్నోత్తర కార్యక్రమంలో సమాధానాలు అవును లేదు కాదు తలెత్తదు అంటూ వస్తుంటాయి. వాటిని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో సమాధానం చెబుతానని స్వయంగా మంత్రి పట్టుబడుతుంటే విపక్ష సభ్యులు చాలు సార్ అనడం అందరికీ ఒక వింతగానే అనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్‌పై ప్రశ్న వచ్చినపుడు హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి సమాధానం చెప్పడంతో చాలాసేపు భరించిన సభ్యులు ఇక చాలు అందరికీ అర్ధం అయింది అనడంతో స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేశారు. దాంతో హోం మంత్రికి చిర్రెత్తుకొచ్చింది, తన సమాధానం చెబుతానని పట్టుబట్టడంతో ఆ సమాధానం తయారుచేసిన అధికారుల వద్దకు వెళ్లి డిప్యుటీ సిఎం మహమ్మూద్ అలి నమస్కారం పెట్టడం కొసమెరుపు
-బి.వి.ప్రసాద్