మిర్చిమసాలా

నోరుజారితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలు జారితే వెనక్కు తీసుకోవచ్చు. దీని వల్ల కాలుకు గాయమైతే, కొన్నాళ్లకు మానుతుంది. అదే నోరు జారితే అంతే. కాంగ్రెస్‌లో తరచుగా వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసే మణిశంకర్ అయ్యర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి నీచ్ జన్మ్ అని తూలనాడారు. గుజరాత్‌లో ఈ సారి ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో కాంగ్రెస్ ఉంది. అయ్యర్ వ్యాఖ్యల వల్ల దగ్గరవుతున్న ఓబిసి ఇతర వర్గాల ఓట్లకు గండి పడుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ అయ్యర్‌పైన వేటు వేసింది. టీవీ చానళ్లు లేని రోజుల్లో అయితే, ఇటువంటి మాటలు అన్నా, తాను అనలేదని రాజకీయనాయకులు అభియోగాలను తోసిపుచ్చేవారు. కాని ఈ రోజుల్లో అవేమి కుదరవు. అన్నీ లైవ్‌లే. పైగా తాను తమిళుడనని, హిందీలో ఈ పదానికి తీవ్రమైన అర్ధం ఉందని భావించలేదని అయ్యర్ చెప్పి, సారీ చెప్పినా ఫలితం లేదు. అందుకే రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై మాట్లాడేటప్పుడు నోరు జారకూడదు. అదీ తెలియని భాషలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అయ్యర్ గతే పడుతుంది జాగ్రత్త.
-శైలేంద్ర
పవన్ పగ!
ఇది సినిమా పేరు కాదు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ట్యాగ్ లైన్. తన అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసి వారి పని పట్టడానికే జనసేనను పెట్టినట్టు పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో తాను భేటీ అయినప్పుడు ‘ఎవడీ పవన్ కళ్యాణ్’ అని ఒవైసీ వ్యాఖ్యానించారని పవన్ కల్యాణ్ గుర్తు చేసారు. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తనను విమర్శిస్తూ ట్విట్ చేసారని చెప్పారు. ఇక ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారిలో పరకాల ప్రభాకర్‌ను ప్రధాన ద్రోహిగా ప్రకటించారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారి పని పట్టడమే జనసేన పంతమని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రతిన పునారు. ఎపిలో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రెండు పార్టీలకు జనసేన పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనని కొందరు ఆశిస్తుండగా, పవన్ కళ్యాణేమో తాను పార్టీ పెట్టిందీ ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారి పని పట్టడానికని అసలు విషయాన్ని బయట పెట్టేసుకున్నారు.
-వెల్జాల చంద్రశేఖర్

కుక్క కోసం..!
కడప జిల్లా రాజంపేటకు చెందిన బస్సు కండక్టర్ గంగేశ్వర రావు కుటుంబం తొమ్మిదేళ్ళుగా ఓ వీధి కుక్కను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే ఇరుగు-పొరుగు వారి అభ్యంతరాలతో ఆ కుక్కను జూబ్లీహిల్స్‌లోని ఓ సంస్థకు అప్పగించా లని గంగేశ్వర రావు కారులో తీసుకుని వచ్చాడు. తీరా ఆ సంస్థ వీధి కుక్కను తీసుకోమని చెప్పడంతో సదరు కండక్టరు ఆ కుక్కను జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెం.36లో వదిలి వేసి స్వస్థలానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అన్నం ముద్ద కాదు కదా పచ్చి మంచి నీళ్లయినా ముట్టుకోకుండా వెక్కివెక్కి ఏడ్వడంతో వారిని కారులో హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఆ వీధిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌ను సంప్రదించడంతో పోలీసులు సీసీ ఫుటేజీలు వెతికే పనిలో నిమగ్నమయ్యారట. విశ్వాసంగా ఉండే కుక్కపై ఎంత ప్రేమో!.
-వి.ఈశ్వర్ రెడ్డి

దగ్గర కాదు
దూరం కాదు
ఆంధ్రాలో పరామర్శల యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మళ్లీ సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాను కాపులకు దగ్గర కాదని, అలాగని కమ్మ వారికి దూరం కాదని వ్యాఖ్యానించి తన వైఖరిని స్పష్టం చేశారు. ఏ పని చేయడానికైనా అధికారం అక్కర్లేదని, అన్నింటినీ పరిష్కరించే నేతను కూడా తాను కాదని చెప్పుకొచ్చారు. వైజాగ్, రాజమండ్రి, విజయవాడల్లో పర్యటించిన పవన్ తన దగ్గరకు వచ్చేవారికి వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి కారణం తనపై ఆశలు ఎక్కువ పెరగకుండా ఉండడానికేనంటూ మరో వివరణ ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాడతానని, అయితే అంతకంటే ముందు ప్రభుత్వాలకు అవకాశం ఇస్తానని మరీ చెప్పుకొచ్చారు. చూడాలి మరి జనసేన ప్రస్థానం ఎటుదారి తీస్తుందో..
-బి.వి.ప్రసాద్