మిర్చిమసాలా

జవాబుకు నాలుగేళ్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసనసభలో ప్రజాప్రతినిధులు ఒక మార్గంలో సమాధానం రాకపోతే మరో మార్గాన్ని ఎంచుకుని మంత్రుల నుండి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వాయిదా తీర్మానాలు, దానిపై స్వల్పకాలిక సమాధానాలు రాబట్టడం ఒకరకమైతే, స్వల్పకాలిక చర్చ, దీర్ఘకాలిక చర్చలకు నోటీసులు ఇవ్వ డం, అదీ లేకుంటే ప్రశ్నోత్తర కార్యక్రమం, చివరికి జీరో అవర్ వంటి అవకాశాలను ప్రజాప్రతినిధులు వాడుకుంటారు. అసలు తమ ప్రశ్న లేవనెత్తేందుకు ఒక మార్గం ఏర్పడటమే కష్టంగా మారినపుడు చివరికి జీరో అవర్‌లో సమస్యను ప్రస్తావిస్తారు. దానికి సభలో మంత్రులు లేచి, ‘నోట్ చేసుకున్నాం అధ్యక్షా.. సంబంధిత మంత్రికి సమాచారం ఇస్తాం’ అని చెప్పడం మామూలే. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశాలు మొదలు నిన్నమొన్నటి వరకూ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన సమస్యలకు మంత్రుల నుండి సమాధానం రాలేదని, జవాబుకు మూడేళ్లు, నాలుగేళ్లా అధ్యక్షా?’ అనడంతో సభ్యులు నవ్వుకోవడం వినా చేసేదేమీ కనిపించలేదు.
- బీవీ ప్రసాద్

అప్పుడు చెప్పలేనివి..
ఏ ఉన్నతాధికారి అయినా సర్వీసులో ఉండగా మనసు విప్పి మాట్లాడరు. ప్రభుత్వం ఇచ్చే అదేశాలను మాత్రమే పాటిస్తారు. కొంత మంది అధికారులు మాత్రం తెగించి ఇలా చేస్తే బాగుండదని తమ అభిప్రాయాలను పాలకులకు చెబుతారు. ఇటీవలి కా లంలో రిటైరైన కొందరు బ్యూరోక్రాట్లు రచయితలుగా మారుతున్నారు. సర్వీసులో ఉండగా తమకు ఎదురైన అనుభవాలను ప్రజలకు పుస్తకరూపంలో అందిస్తున్నారు. ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకం ఆసక్తిని రేకెత్తించగా, మరో రిటైర్డ్ అధికారి అజయ్ కల్లం రాసిన పుస్తకం ఇటీవలే విడుదలైంది. రిటైర్డైన అధికారులు తమ అనుభవాలను అక్షర రూపంలో నిక్షిప్తం చేయడం మంచిదే. సర్వీసులో ఉండగా వీరేమి చేశారనే విమర్శలు ఎటూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పుస్తకాలు రాయడం వల్ల ప్రజలకు కొన్ని విషయాలైనా తెలిసే అవకాశం ఉంది.
-కెవీఎస్

వెంకయ్య వౌనం!
రాష్ట్ర విభజనలోనూ ఆపై భాజపాకు తెదేపాను సన్నిహితం చేయడంలోను కీలక పాత్ర వహించిన ప్రస్తుత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఇప్పు డు ఏపీ వ్యవహారాలకు దూ రంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నా, ఉప రాష్టప్రతిగా బాధ్యతలు చేపట్టినా ఆయన తరచూ గన్నవరంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్‌కు వచ్చి వెళుతుండే వారు. ఇదే సమయంలో ఆసుపత్రులు, విద్యాసంస్థలను సందర్శిస్తూ పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్భ్రావృద్ధికి హామీలు, సలహాలు ఇస్తుండేవారు. తనకు అత్యంత ఆప్తుడైన ఏపీ సీఎం చంద్రబాబు ఎన్‌డీఏ కూటమికి ‘గుడ్ బై’ చెప్పేయడంతో వెంకయ్య ఏపీలో అడుగుపెట్టడం లేదంటూ భాజపా శ్రేణుల్లో చర్చ మొదలైంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి వెంకయ్య మద్దతు ఇచ్చిఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
-నిమ్మరాజు చలపతిరావు