మిర్చిమసాలా

ట్విట్టర్ పిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల పిట్ట, వివిధ రకాల పిట్టలను చూశాం కానీ ట్టిట్టర్ పిట్ట ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా?. కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఏ పార్టీకీ సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. కాగా కాంగ్రెస్-జెడిఎస్‌లను చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భరత మాత మీద ఒట్టు పెట్టి చెప్పగలరా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు. పైగా టెంట్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఇప్పుడు జెడిఎస్-కాంగ్రెస్ కలవడంపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సినీమా వాళ్ళ గురించి, ఇతర అంశాల గురించి తరచూ ట్వీట్ చేసే ట్విట్టర్ పిట్ట ఇప్పుడు ఎందుకు కూయలేదని ప్రశ్నించారు. ట్విట్టర్ పిట్ట ఎవరూ? అని ఓ విలేఖరి ప్రశ్నించగా, మంత్రి కేటీఆర్ అని ముక్తసరిగా సమాధానమివ్వడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి

‘కృష్ణా’ను చీల్చి ఎన్టీఆర్ పేరు..?!

కృష్ణా జిల్లాలో నెల రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర సాగించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సరికొత్త వివాదానికి తెరలేపి వెళ్లారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో పర్యటిస్తూ తాను అధికారంలోకి వస్తే తక్షణం కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటూ హామీ ఇచ్చారు. తమతో ఎలాంటి చర్చ జరపకుండా అలాంటి ప్రకటన చేయడం ఏమిటంటూ స్వపక్షంలోనే విమర్శలొచ్చాయి. సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. అయితే ఒక గీతను చిన్న గీతలా మార్చటానికి పక్కన పెద్ద గీత గీసిన చందంగా జిల్లాను రెండుగా చీల్చి ఓ భాగానికి ఎన్టీఆర్ పేరు పెడితే సరికదా అంటున్నారు కొందరు. తెలంగాణాలో పది జిల్లాలు 31 జిల్లాలు కాలేదా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు