మిర్చిమసాలా

అదో లెక్కా...??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుగారు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అనేది సామెత. పోలీసులు తలచుకుంటే కేసులకు కొదవా అనేది నేటి సామెత. 2016లో జరిగిన ఎమ్సెట్-2 పేపర్ లీక్ కేసులో రోజుకో నిందితుడ్ని చూపిస్తూ పోలీసులు గడిపేస్తున్నారు. ఎమ్సెట్ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని ఆనాడు అంతా నోరుచేసుకున్నా పోలీసులు ఛీ ఛీ అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేసి, అకస్మాత్తుగా కార్పొరేట్ కాలేజీలో ఇద్దర్ని అరెస్టు చేయడమేగాక, కాల్ డాటాతో వారిని పసిగట్టామని చెబుతున్నారు. ఐదు నిమిషాల్లో తెలిసిపోయే కాల్‌డాటా కోసం రెండేళ్లు ఆగాలా అనేది మిగిలిన వారి ప్రశ్న. ఏమైతేనేం పోలీసులు కార్పొరేట్ తీగ లాగడంతో ఇపుడు డొంక కదులుతుందేమోనని అంతా భుజాలు తడుముకుంటున్నారు. నయాం కేసు, డ్రగ్స్ కేసులు చూసిన వారికి లీక్ కేసు ఓ లెక్కా...
- బీవీ ప్రసాద్

కొక్కొరోకో..!
కర్నాటకలోని పెద్దనహళ్లికి చెందిన ఓ రైతు సంతకు వెళ్ళి రెండు కోళ్లను రూ.150కి ఖరీదు చేశాడు. ఆ తర్వాత తన సొంతూరుకు వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కండక్టర్‌కు తన వద్ద ఉన్న రూ.50 నోటును తీసి టిక్కెట్ కోసం ఇచ్చాడు. అయితే కండక్టర్ ఆ రైతుకు రూ.24, రెండు కోళ్లకు రూ.12 చొప్పున రూ.24 మొత్తం రూ.48 తీసుకుని టిక్కెట్లతో పాటు రెండు రూపాయల బిళ్ల చేతిలో పెట్టాడు. దీంతో సదరు రైతు అవాక్కయ్యాడు. అదేమిటనీ ప్రశ్నించగా, పెంపుడు జంతువులను బస్సుల్లో తరలిస్తే, సగం టిక్కెట్ తీసుకోవాలని కర్నాటక ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుందని సదరు కండక్టర్ చల్లగా చెప్పాడు. ఇంకా నయం, బస్సు దించేయలేదని రైతు సర్దుకుపోయాడట పాపం. అటువంటి నిర్ణయం మన ఆర్టీసీ కూడా తీసుకుంటుందేమో తస్మాత్ జాగ్రత్త!
- వి. ఈశ్వర్‌రెడ్డి

వర్షాలంటే వణుకుతున్న జీహెచ్‌ఎంసీ
వర్షాలు వస్తున్నాయంటే అందరూ సంతోషపడతారు..కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు, సిబ్బంది మాత్రం వర్షాలంటే వణికిపోతున్నారు. హైదరాబాద్‌లో చినుకుపడితే చాలు రోడ్లన్నీ జలమయం కావడం, ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడం షరామామూలే. గాలి వాన వస్తే చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడుతుంటాయి. రోడ్లపై నీరు నిండితే మ్యాన్‌హోల్‌లు ఎక్కడ తెరుకుంటాయో, వాటిల్లో ఎవరు పడతారోనన్న వేదన జీహెచ్‌ఎంసీ అధికారులను వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతుండటంతో అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.
- పి.వి. రమణారావు