మిర్చిమసాలా

దటీజ్ వెంకయ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోదా పెరిగేకొద్దీ చాలామంది జీవన శైలిలో పెనుమార్పులు వచ్చేస్తుంటాయి. ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సామాన్య రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత పదవులను చేపట్టినా, తాను మొదటి నుంచీ నమ్ముకున్న క్రమశిక్షణను మాత్రం మరువలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభకి వచ్చిన నాయుడు ఎప్పటిలానే నిర్మొహమాటంగా మాట్లాడారు. అం దరూ సెల్‌ఫోన్లు కట్టివేయాలని, వేదికపైన, దిగువన అటుఇటూ తిరగవద్దని, సభా వేదికపై ఐదుగురికి మంచి అవకాశం లేదని నిర్మొహమాటంగా చెప్పారు. నిర్ణీత సమయానికే సభా కార్యక్రమం ముగియాల్సి ఉన్నప్పటికీ తనకు సాధ్యపడటం లేదన్నారు. ఢిల్లీలోని తన ఇంటికి సందర్శకులుగా వచ్చే రైతుల సంఖ్య పెరుగుతోందన్నారు. వేదిక పైకి వెళుతూ తొలి వరుసలో ఉన్న వారందరినీ ఉప రాష్టప్రతి ఆప్యాయంగా పలకరించుకుంటూ వెళ్లారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే పదవులకు అందం అని ఆయన చాటుతున్నారు.
-నిమ్మరాజు చలపతిరావు
భలే మంచిదొంగ..!
దొంగ అంటేనే దొంగ. ఇంకా మంచిదొంగ, చెడ్డదొంగ ఉంటారా? అని అనుకుంటున్నారా? నిజమే.. ఆ దొంగ పశ్చాత్తాపపడి తనకూ మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు. అసలేం జరిగిందంటే- కేరళలోని అంబలపుజ సమీపంలోని థకుజి గ్రామంలోని ఒక కుటుంబంలోని వారంతా ఇటీవల ఇంటికి తాళాలు వేసుకుని బంధువుల వివాహానికి వెళ్ళారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న వారు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఫింగర్ ఫ్రింట్స్ తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. మర్నాడు ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి ఆ ఇంటికి వచ్చి, తానే దొంగతానికి పాల్పడ్డానని , అందుకు పశ్చాత్తాపపడుతున్నానని చెప్పాడు. దొంగిలించిన వస్తువులన్నీ ఇంటి యజమానికి అప్పగించి కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ కుటుంబ సభ్యులు సదరు దొంగపై జాలి పడి కేసు వెనక్కి తీసుకున్నారు. దొంగను పోలీసులకు అప్పగించకుండా, భవిష్యత్తులో బుద్దిగా బతకాలంటూ హితబోధ చేసి పంపించేశారు.
-వి.ఈశ్వర్ రెడ్డి
వార్త దొరికితే చాలు..
ఆహారం కోసం వేట ప్రకృతి సహజం. నిరంతరం అడవుల్లో సంచరించే జంతువులు తమకంటే చిన్నవైన జంతువులను వేటాడటం, ఆకలి తీరిన తర్వాత తీరుబడిగా విశ్రాంతి పొందడం తెలిసింద. మనుషుల తీరు కూడా దాదాపు అదే దిశగా నిరంతరం శ్రమించడం లక్ష్యాలను సాధించిన తర్వాత విరామం పొందడం సహజం. నేడు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నదీ అదే. రోజంతా మసాలా వార్తల కోసం ఆహారం మాదిరి వేటాడి, అది కాస్తా దొరకగానే సంతృప్తి చెంది, విశ్రాంతి పొందుతుంటాయి. అప్పట్లో భూ రికార్డులు, నయాం కేసు, దొంగనోట్ల ముఠా, చైన్‌స్నాచింగ్, డ్రగ్స్, సినీతారల కాస్టింగ్ కౌచ్... ఇలా ఎప్పటికపుడు ఆ రోజు కడుపునిండితే చాలు.. మొన్నటికి మొన్న తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఢిల్లీ వెళ్తారా? వెళ్లరా? అంటూ ఒక రోజంతా వార్తా కథనాలను వండిన మీడియాకు- ఆ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నుకొట్టిన అంశం భలేగా దొరికింది. ఇరవై నాలుగు గంటలూ చూపించే వార్తలనే చూపించడానికి టీవీ మీడియాకు ఎదో ఒక వార్త దొరక్కపోదు!
-బీవీ ప్రసాద్