మెయిన్ ఫీచర్

ఆత్మసౌందర్యం ఎంతో గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మిస్ వరల్డ్ 2015’ విజేత మిరేయా
======================

దక్షిణ చైనాలోని ప్రముఖ ద్వీప పర్యాటక కేంద్రమైన సాన్యా నగరంలో ముగిసిన ‘మిస్ వరల్డ్’ తుది పోటీలో 114 మందిని వెనక్కి నెట్టేసి మిరేయా లలగున రొయో (23) కిరీటాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తుది ఘట్టంలో ఆమె తన ‘బహిరంగ ప్రసంగం’ ద్వారా న్యాయ నిర్ణేతల మెప్పు పొంది విజేతగా నిలిచారు. ‘ప్రపంచ సుందరి’ పోటీల్లో తొలిసారిగా స్పెయిన్‌కు ఈ ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ఘనత ఆమెకే దక్కింది. బార్సిలోనా నగరంలో ఉంటున్న ఆమె ఫార్మకాలజీలో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం మోడలింగ్ వృత్తిలో బిజీగా ఉంటున్నారు. నూట్రిషన్‌లో పీజీ కోర్సు చదవాలన్నదే తన తదుపరి లక్ష్యమని మిరేయా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
=============

‘శారీరక సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఈ కోణంలోనూ ఆలోచించి న్యాయ నిర్ణేతలు సముచిత నిర్ణయం తీసుకోవడం నాకెంతో ఆనందం కలిగించింది..’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది ప్రపంచ అందాల సుందరి పోటీ (మిస్ వరల్డ్-2015)ల్లో కిరీటాన్ని కైవసం చేసుకున్న స్పెయిన్ సౌందర్యరాశి మిరేయా. అందాల పోటీల్లో శరీరాకృతికే కాదు, వ్యక్తిత్వం, నైతిక విషయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తాను కోరుకున్నానని, న్యాయ నిర్ణేతలు కూడా ఈ దిశగానే ఆలోచించడం సముచితంగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది. దక్షిణ చైనాలోని ప్రముఖ ద్వీప పర్యాటక కేంద్రమైన సాన్యా నగరంలో ముగిసిన ‘మిస్ వరల్డ్’ తుది పోటీలో 114 మందిని వెనక్కి నెట్టేసి మిరేయా లలగున రొయో (23) కిరీటాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తుది ఘట్టంలో ఆమె తన ‘బహిరంగ ప్రసంగం’ ద్వారా న్యాయ నిర్ణేతల మెప్పు పొంది విజేతగా నిలిచారు. ‘ప్రపంచ సుందరి’ పోటీల్లో తొలిసారిగా స్పెయిన్‌కు ఈ ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ఘనత ఆమెకే దక్కింది. బార్సిలోనా నగరంలో ఉంటున్న ఆమె ఫార్మకాలజీలో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం మోడలింగ్ వృత్తిలో బిజీగా ఉంటున్నారు. నూట్రిషన్‌లో పీజీ కోర్సు చదవాలన్నదే తన తదుపరి లక్ష్యమని మిరేయా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇదే నెలలో ‘మిస్ వరల్డ్ స్పెయిన్-2015’గా ఎంపికైన ఆమె ప్రముఖ సోషల్ వెబ్‌సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో తన పేరిట ఓ ప్రత్యేక పేజీని నిర్వహిస్తున్నారు. అందులో తరచూ తన ఫొటోలు ఉంచుతూ మోడలింగ్ కళకు ప్రచారం చేయడం తనకెంతో ఇష్టమని ఆమె చెబుతుంటారు. సుమారు 900 ఫొటోలను ఆమె తన పేజీలో ఉంచి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఆమెకు ‘్ఫలోయర్ల’ సంఖ్య కూడా అధికంగానే ఉంది. అందాల పోటీ సందర్భంగా చైనాలో విడిది చేసినపుడు తీసుకున్న పలు ఫొటోలను సైతం అభిమానుల కోసం ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆమె ఉంచారు. చిరకాలం గుర్తుండిపోయేలా ‘సెల్ఫీలు’ తీసుకోవడమన్నా తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. స్పానిష్‌తో పాటు ఇంగ్లీషు, కటలాన్, ఫ్రెంచ్ భాషల్లో ఆమె మాట్లాడుతూ అభిమానులను అలరిస్తుంటారు. శిరోజాలకు ఆకర్షణీయమైన రంగులు వేసుకునేందుకు ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. రంగు ఏదైనా అందంగా కనిపించాలన్నదే తన తపన అంటున్నారు. అందాల పోటీలు జరిగిన సాన్యా పరిసర ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ, వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి మధురానుభూతులను మిగిల్చాయని మిరేయా సంతోషం వ్యక్తం చేశారు. ‘మిస్ వరల్డ్’ పోటీలో ‘టాప్ మోడల్’గా నిలవడమే కాదు, తన వాక్చాతుర్యంతో కట్టిపడేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తుది పోటీలో రష్యా, లెబనాన్, ఇండోనేషియా, జమైకాలకు చెందిన ముద్దుగుమ్మలను ఓడించి విజేతగా నిలిచిన మిరేయా స్పెయిన్ పతాకాన్ని రెపరెపలాడించారు. కాగా, 2003 నుంచి ‘మిస్ వరల్డ్’ పోటీలకు చైనా ఏడుసార్లు ఆతిథ్యం ఇచ్చింది. 65వ ‘మిస్ వరల్డ్’ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి చైనా ప్రభుత్వం ఆహూతుల నుంచి ప్రశంసలు అందుకుంది. లండన్‌కు చెందిన ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ సంస్థ 64 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో తొలిసారిగా ‘ప్రపంచ సుందరి’ పోటీలకు శ్రీకారం చుట్టింది. మహిళల గౌరవ మర్యాదలను కాపాడాలంటూ వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఈసారి అందాల పోటీల్లో ‘బికినీ రౌండ్’ను రద్దు చేశారు. అందగత్తెల సౌందర్యాన్ని, మనో వికాసాన్ని అంచనా వేసేందుకు ‘బికినీ రౌండ్’ ఏ విధంగానూ అవసరం లేదని ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ గత ఏడాదే ప్రకటించింది. ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ సంస్థ 2016లో చేపట్టే పలు సామాజిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించాల్సిన బాధ్యత తనపై ఉందని మిరేయా అంటున్నారు. సామాజిక రుగ్మతలను నివారించేందుకు, ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారకర్తగా తన వంతు కృషి చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ఆమె చెబుతున్నారు.
*