రాష్ట్రీయం

అపహరణకు గురైన బాలికలు ఏమైనట్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే స్టేషన్ల అడ్డాగా అక్రమ రవాణ
చిన్నారులు, యువతులే టార్గెట్
ముఖ్య కూడళ్లలో లోపించిన నిఘా
సివిల్, రైల్వే పోలీసుల్లో సమన్వయ లోపం
ఏడాదిలో 1330 మిస్సింగ్ కేసులు

హైదరాబాద్, నవంబర్ 22: గత కొంతకాలంగా రైల్వే స్టేషన్లు అడ్డాగా బాలికలు అపహరణకు గురవుతున్నారు. చిన్నారులు, యువతులను టార్గెట్ చేస్తూ ముఠాలు బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఇటీవల సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల బాలిక దివ్యను సంతానం లేని ఓ కుటుంబానికి విక్రయించిన ముఠా సభ్యుల్లో ఒకరు అరెస్టు కావడంతో గుట్టు రట్టయ్యింది. అయితే ఈ ముఠా కేవలం చిన్నారులను అపహరించడమే కాకుండా, యువతులనూ మాయమాటలతో మోసగిస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తుంది. అపహరణకు గురైన చిన్నారి దివ్య తల్లి రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ఈ విషయం తేలింది. రాష్ట్రం దాటేస్తున్న ముఠా సభ్యులను సికిందరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో విస్మయానికి గురిచేసే అంశాలు బహిర్గతమయ్యాయి. ఎట్టకేలకు ఐదేళ్ల చిన్నారి దివ్వను కాపాడిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. వందలాది చిన్నారులు, యువతులను కిడ్నాప్ చేసి ఆంధ్ర, తెలంగాణ, మహరాష్టల్ల్రో విక్రయిస్తున్నట్టు ముఠా సభ్యులు అంగీకరించారు. అయితే ముఠా సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సికిందరాబాద్, ఖాజీపేట, వరంగల్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తాడేపల్లిగూడెం, తిరుపతి రైల్వే స్టేషన్లలో మకాంవేసి చిన్నారులను, యువతులను కిడ్నాప్ చేస్తుంటారని పోలీస్ విచారణలో తేలింది. ఇదిలావుంటే, ఈ ఏడాది 1330మంది చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. 553మంది చిన్నారులను పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మాయగాళ్ల చెరలో పడిన యువతులు మిస్సింగ్ కేసులుగానే మిగిలిపోతున్నారు. 667మంది యువతుల అక్రమ రవాణ జరిగినట్టు సమాచారం. అయితే మైనర్లను కిడ్నాప్ చేసి కొంతకాలం వారిచేత ఇంటి పనులు చేయించి, తరువాత వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. వారంక్రితం పృథ్వి అనే పద్నాలుగేళ్ల బాలుడిని తన బంధువే కిడ్నాప్ చేసి ఐదువేలకు విక్రయించిన సంఘటన నగరవాసులను కలచివేసింది. కాగా పోలీసులు కిడ్నాపర్‌ను అరెస్టు చేయగలిగారే తప్ప.. పృథ్వీ ఎక్కడున్నది నేటివరకు గుర్తించలేకపోయారు. అదేవిధంగా కిడ్నాప్‌కు గురైన 1330 మంది చిన్నారుల్లో కేవలం 653 మందిని కాపాడిన పోలీసులు, మిగతావారిని మిస్సింగ్ కేసులుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సివిల్, రైల్వే పోలీసుల్లో సమన్వయం కొరవడటంతో చిన్నారులకు రక్షణ కరువైందన్న అభియోగాలను పోలీస్ శాఖ ఎదుర్కొంటోంది. క్రైమ్ ఇనె్వస్టిగేషన్ డిపార్టుమెంట్, స్థానిక పోలీసులు, ఉమెన్, చైల్డ్‌వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఎన్ని దర్యాప్తులు చేపట్టినా కిడ్నాప్‌నకు గురైన చిన్నాలను, యువతుల ఆచూకీ తెలుసుకోలేక పోతున్నారు. చిన్నారుల అపహరణ, యువతుల అక్రమ రవాణా వెనుక బలమైన ముఠా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లలో సిసి కెమెరాలు లేకపోవడం, ఉన్నచోట అవి మొరాయించడంతో కిడ్నాపర్లను పట్టుకోలేక పోతున్నటు తెలుస్తోంది.