కర్నూల్

ముగిసిన ధరణి సీతారామ ఆరాధనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ
ఆళ్లగడ్డ, డిసెంబర్ 27: మండలంలోని లింగందినె్న గ్రామంలో జరుగుతున్న శ్రీ ధరణి సీతారామ యోగీంద్ర స్వాముల ఆరాధన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. అందులో భాగం గా చివరి రోజైన ఆదివారం మూలమూర్తి శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే శ్రీ ధరణి సీతా రామయోగీంద్ర స్వాముల వారి జీవసమాధిని అర్చకులు అభిషేకం చేసి జీవసమాధిని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరింరారు. అనంతరం స్వామి వారి వంశీయుల గృహం నుండి స్వామి యోగా బెత్తాన్ని, ఆయన పాదుకలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొని వచ్చి స్వామి జీవసమాధి వద్ద వుంచి పూజలు చేశారు. స్వామి దర్శనార్ధం వచ్చిన భక్తులకు బెత్తాన్ని, పాదుకలను భక్తులకు కనులారా చూసే అవకావం కల్పించారు. శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణము, మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు, అష్టోత్తర సహస్రనామ పూజలు చేశారు. వేదపండితులు శ్రీ దత్తహోమాన్ని ఘనంగా నిర్వహించారు.
స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే అఖిలప్రియ
మండలంలోని లింగందినె్నలో శ్రీ ధరణి సీతారామ స్వామి ఆరాధనోత్సవాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పూజలు చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ దత్త హోమంలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట లింగందినె్న సర్పంచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.
అహోబిలేసుని సన్నిధిలో ఐజి
ఆళ్లగడ్డ, డిసెంబర్ 27: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఐజి గోపాలకృష్ణ తమ కుటుంబసభ్యులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన రాక సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చక బృందం పూర్ణకంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎగువలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగవన వెలసిన వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్లను కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయనకు ప్రధానార్చకులు నవనారసింహుల చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట రూరల్ ఎస్‌ఐ రామయ్య, పట్టణ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి వున్నారు.