ఖమ్మం

కన్నుల పండువగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం మండలంలోని పలు చర్చిలలోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత సండ్ర స్థానిక ప్రేయర్ టవర్ చర్చిలో ఫాస్టర్ పి ఎనోష్‌కుమార్ ఆధ్వర్యంలో క్రిస్‌మస్ కేక్ కట్‌చేసి హాజరైన క్రైస్తవులకు నూతన సంవత్సర, క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ముస్లీంలకు దుస్తులు పంపిణి చేసారు. అదేవిధంగా స్థానిక హిమాలయ బాప్టిస్టు చర్చి, సిఎస్‌ఐ చర్చిలను సందర్శించి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులు సుఖ సంతోషాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న సండ్రకు ఎంఎస్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా శాలువా, పూల దండలతో సండ్రను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఎండి సుదర్శన్, టిడిపి మండలాధ్యక్షులు కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, కొరకొప్పు ప్రసాద్, ఉబ్బన వెంకటరత్నం, వలసాల వెంకట్రామయ్య, అజ్మీర జమలయ్య, సిఎచ్ కిరణ్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, గొల్లమందల ప్రసాద్, కుంచాల నారాయణ, పైళ్ల రామారావు, బొక్కా వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, కట్టా అర్లప్ప, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం మండలంలో...
ఖానాపురం హవేలి: రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం అర్థరాత్రి నుంచే చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు ప్రార్థనల్లో మునిగిపోయారు. ఏసుక్రీస్తు తమకు అండగా ఉంటే తమ కష్టాలు తీరుతాయని, ఎంతటి కష్టతరమైన పనినైనా సునాయసంగా పరిష్కారం అవుతాయని క్రైస్తవ సోదరుల నమ్మకం. క్రైస్తవ సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ కావటంతో చర్చిలను రంగురంగు విద్యుత్‌ద్దీపాలతో సుందరంగా అలంకరించారు. చర్చి ఫాస్టర్లు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు గొప్పతనాన్ని వివరిస్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చర్చిలన్ని క్రైస్తవ సోదరులతో నిండిపోయాయి. శుక్రవారం తెల్లవారుఝామున ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని చర్చిల్లో కేక్‌లు కట్ చేసి పంపిణీ చేశారు.
కాకర్ల చర్చిలో...
జూలూరుపాడు: మండల పరిధిలోని కాకర్ల ఆర్‌సిఎం చర్చిలో జూలూరుపాడు ఆర్‌సిఎం చర్చి ఫాదర్ పి. ఆంథోని చేతుల మీదుగా 30 మంది క్రైస్తవ కుటుంబాల వారికి క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మేడి శ్రీనివాస్ తండ్రి రాందాసు జ్ఞాపకార్ధం 30 మందికి దుప్పట్లు, దొండపటి శ్రీనివాస్ 30 మంది మహిళలకు చీరలు ఇవ్వగా ఫాదర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెంగల గురునాధం, టిఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి చాపలమడుగు రాంమ్మూర్తి, జిల్లా నాయకులు వేల్పుల నర్శింహారావు సొసైటీ ఉపాధ్యక్షుడు మల్లేల నాగేశ్వరరావు, మేడి ప్రసాద్,, చక్రధర్ పాల్గొన్నారు.
సత్తుపల్లిలో...
సత్తుపల్లి: క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుఝామున 3గంటల నుంచే పట్టణంలోని చర్చిలకు కుటుంబాలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.సందర్భంగా ఆయా చర్చిల పాదర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ ప్రభువు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలన్నారు.అనంతరం క్రిస్టియన్స్ నిర్వహించుకునే ఏకైక పండుగ కావటంతో ఆయా కుటుంబాలు బంధుమిత్రుల రాకతో సందడిగా మారింది.
తిరుమలాయపాలెంలో..
తిరుమలాయపాలెం: సిఎస్‌ఐ చర్చిల్లో శుక్రవారం తెల్లవారజాము నుండి ఆర్‌సిఎం చర్చిల్లో గురువారం అర్థరాత్రి నుండి ప్రార్థనలు ప్రారంభించి పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా చర్చిలను రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించారు. స్థానిక ఆర్‌సిఎం చర్చిలో ఫాదర్ జుగుంట్ల ప్రభాకర్, సిఎస్‌ఐ చర్చిలో ఫాస్టర్ రెవరెండ్ చార్లెస్ సురేందర్‌బాబు, పెంతుకోస్తులో ఫాస్టర్ పిడతల సామేలుతో పాటు వివిధ చర్చిల్లో చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కార్యక్రమంలో సంఘ పెద్దలు జాన్ జయరాజ్, సుగుణమ్మ, ప్రమీల దేవకుమారి, తామస్, విజయ్‌కుమార్, సిస్టర్లు, నోరా, అనీల్ తదితరులు పాల్గొన్నారు.