రాష్ట్రీయం

విజన్ ఉన్నా... ఆచరణ సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శలు
అబద్దాలు చెప్పడంలో కవితకు డాక్టరేట్ అంటూ ఎద్దేవా

హైదరాబాద్, నవంబర్ 23: ‘ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు విజన్ ఉన్నా...ఆచరణలో సున్నా’ అని బిజెపి ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో టిఆర్‌ఎస్ ఎంపి కవితకు, ఆ పార్టీ నేతలకు డాక్టరేట్ ఇవ్వవచ్చని ఆయన సోమవారం పార్టీ నాయకులు రఘునందన్, ప్రకాశ్‌రెడ్డి, టి. స్వామితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందన్న చందంగా ఎంపి కవిత, ఆ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై అనేక అసత్యపు ప్రచారం చేస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని కవిత విమర్శించడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహా నిర్మాణంపై నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిన ప్రతిపాదనల మేరకే కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 10 వేల ఇండ్ల కోసమే ప్రతిపాదనలు పంపించిందని, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి కావాలో కేంద్రాన్ని కోరాలే తప్ప కేవలం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం సమంజసం కాదని అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తర్వాత ఏ మేరకు హామీలు నిలబెట్టుకున్నదో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు పలువురు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంచి విజన్ ఉందంటూ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, విజన్ ఉండడమే ముఖ్యం కాదని, దానిని ఆచరించడం ముఖ్యం అని అన్నారు. మంచి వంట చేయాలన్న లక్ష్యం ఉంటుంది కానీ, ఆ వంట చేయలేకపోవడం వైఫల్యమే అవుతుంది కదా? అని రామచందర్ రావు ఎదురు ప్రశ్నించారు.