ఆంధ్రప్రదేశ్‌

మోదకొండమ్మ ఉత్సవాల్లో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో బుధవారం బాణసంచా పేలడంతో తొక్కిసలాట జరిగి 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. అమ్మవారి ఆలయం వద్ద బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వ ఎగరిపడి తారాజువ్వల కట్టపై పడింది. దీంతో ఒక్కసారిగా తారాజువ్వలు జనంపైకి దూసుకుపోయాయి. అనుకోని ఈ పరిణామానికి భక్తులు పరుగులు తీశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పాడేరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైన ఓ బాలికను విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.