బిజినెస్

సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేగవంతంగా సంస్కరణలను అమలుపరుస్తాం * ఆసియాన్-ఇండియా సదస్సులో ప్రధాని మోదీ

కౌలాలంపూర్, నవంబర్ 21: విదేశీ మదుపరులను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్-ఇండియా సదస్సులో వేగవంతమైన, సాహసోపేతమైన సంస్కరణలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పారదర్శకమైన, సరళతరమైన పన్ను విధానాలను తీసుకొస్తామన్న భరోసాను కల్పించారు. భారత్-ఆసియాన్ మధ్య భౌతిక, సాంకేతిక అనుసంధానానికి వీలుగా ప్రాజెక్టుల ప్రగతికి ఒక బిలియన్ డాలర్లను ప్రకటించారు. ప్రస్తుతం 7.5 శాతం జిడిపి వృద్ధిరేటుతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ముందుందని, సమీప భవిష్యత్తులో భారత్ వృద్ధిరేటు మరింతగా పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తమ సంస్కరణలు కొనసాగుతాయని, వేగంగా ఈ సంస్కరణలను తీసుకొస్తామన్న ఆయన పలు సాహసోపేతమైన నిర్ణయాలూ తీసుకుంటామని, ఈ విషయంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని, ద్రవ్యలోటు కూడా ఆమోదయోగ్యంగానే ఉందన్నారు. వ్యాపార, పారిశ్రామికపరమైన విశ్వాసం ఎంతో మెరుగైందని చెప్పారు. అంతకుముందు ఆసియాన్ వ్యాపార, పెట్టుబడుల సదస్సులో మోదీ మాట్లాడుతూ గడచిన 18 నెలల తమ ప్రభుత్వ పాలనలో ఆర్థికపరమైన అంశాల్లో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో ప్రమాదకర స్థాయికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చామని, జిడిపి వృద్ధిరేటు కూడా పెరిగిందన్నారు. విదేశీ పెట్టుబడులు కూడా పెరిగాయని గుర్తుచేశారు. ‘సంస్కరణలు వాటంతటవే ఆగవు. నిర్దేశిత లక్ష్యసాధన కోసం జరిగే ధీర్ఘకాల ప్రయాణంలో అవి కొనసాగుతూనే ఉంటాయి.’ అని ఈ సందర్భంగా మోదీ సంస్కరణలపట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేశారు. గత ఏడాది మే నెలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అధిక ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, స్తంభించిన వౌలిక ప్రాజెక్టులు వంటివి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయన్నారు.
కాగా, పన్ను విధానంపై విదేశీ మదుపరులలో నెలకొన్న భయాల మధ్య వాటిని నివృత్తి చేస్తామని, సరళతరమైన, ఆమోదయోగ్యమైన పన్నుల విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది మోదీ పాలన ప్రారంభంతో పోల్చితే ప్రస్తుతం విదేశీ మదుపరులకు భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి సన్నగిల్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ మదుపరులను ఆకట్టుకునే దిశగా ఆయన వెళ్తున్నారు.
చైనా భాగస్వామ్యానికి..
భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ సౌర కూటమిలో భాగస్వాములు కావాలని చైనాను ఈ సందర్భంగా మోదీ ఆహ్వానించారు. ఆసియాన్-ఇండియా సదస్సులో భాగంగా ఇక్కడ చైనా ప్రధాన మంత్రి లీ కెక్వియాంగ్‌తో సమావేశమైన నరేంద్ర మోదీ వాతావరణ మార్పులపై చర్చించారు. ఇరు దేశాల ప్రధానులు దీన్ని సమీక్షించారు.
(చిత్రం) ఆసియాన్ వ్యాపార, పెట్టుబడుల సదస్సులో మాట్లాడుతున్న మోదీ