జాతీయ వార్తలు

చెన్నైకి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్షణ సాయంగా వెయ్యకోట్లు
ప్రధాని మోదీ ప్రకటన
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
చెన్నై, డిసెంబర్ 3:కనీవినీ ఎరుగని రీతిలో తమిళనాడు,రాజధాని చెన్నైని ముంచెత్తిన వర్షాలు, వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చెన్నై వచ్చి హెలికాప్టర్ నుంచి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు ప్రకటించారు. నీటి మధ్య చిక్కుకు పోయిన వేలాది మందిని రక్షించే విషయంలో ఎలాంటి జాప్యానికి ఆస్కారం ఉండకూడదన్నారు. సహాయ, సంక్షేమ చర్యల్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే 940 కోట్లను కేటాయించిన కేంద్రం దానికి అదనంగా మరో వెయ్యి కోట్లు ఇస్తోందని తెలిపారు. ‘నేను మీకు అండగా ఉంటా’నంటూ ఐఎన్‌ఎస్ అడియార్‌లో తమిళంలో మాట్లాడిన మోదీ రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో ప్రధాని మోదీ మాట్లాడారు. వర్షం, వరదల వల్ల తమిళనాడుకు కలిగిన నష్టాన్ని, కష్టాన్ని పరిశీలించానని, ఈ ఆపత్సమయంలో తమిళనాడు ప్రజలకు అండగా, వెన్నుదన్నుగా భారత ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జయలలితతో వరద పరిస్థితిపై చర్చించిన తర్వాత కేంద్ర సాయాన్ని ప్రధాని ప్రకటించారు. (చిత్రం) ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ