జాతీయ వార్తలు

అంబేద్కర్ ఆశయ సాధనకు కంకణ బద్ధులమవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆర్థికపరమైన ఆలోచనలు, దృక్కోణాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ సుభిక్షమైన, సమాజంలోని అన్నివర్గాలు అభివృద్ధి చెందిన భారత్‌ను తయారు చేయాలన్న ఆయన విజన్‌ను, కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలలో భాగంగా 125 రూపాయలు, 10 రూపాయల స్మారక నాణేలను ప్రధాని ఆదివారం ఇక్కడ విడుదల చేసారు. అంబేద్కర్ ఎంతో దూరదృష్టి కలిగిన, గొప్ప ఆలోచనా పరుడని, ఆర్థిక విషయాల్లో ఆయన ఆలోచనలు, దృక్కోణాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా గుర్తించలేదని ప్రధాని అన్నారు. ‘సమాజంలోని అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించే భారతావనిని రూపొందించాలన్న అంబేద్కర్ విజన్, కలలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుంది’ అని కార్యక్రమం అనంతరం మోదీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా అంబేద్కర్ 60 వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ భవనం లాన్స్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలుంచి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ తదితర నేతలు ఘనంగా నివాళులర్పించారు.
(చిత్రం) అంబేద్కర్ స్మారక నాణేల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ