జాతీయ వార్తలు

పోలవరంపై చర్చిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజూ జనతాదళ్ ఎంపీలకు ప్రధాని హామీ
నిర్మాణాన్ని నిలిపివేయాలన్న డిమాండ్‌పై స్పందించని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పోలవరం ప్రాజెక్టు వివాదంపై నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో చర్చలు జరుపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఒడిశాకు చెందిన బిజెడి పార్లమెంటు సభ్యులు గురువారం నరేంద్ర మోదీని కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలో ముంపునకు గురవుతున్న గిరిజన ప్రాంతాల గురించి వివరించినప్పుడు నరేంద్ర మోదీ ఈ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలన్న డిమాండ్‌పై మోదీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ఎంపీలు లేవదీసిన అనుమానాలను నీతి ఆయోగ్ పరిశీలిస్తుందని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమతో చర్చించి అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని బర్తృహరి మహతాబ్ నాయకత్వంలో ప్రధానిని కలిసిన బిజెడి ఎంపీలు ఆరోపించారు. పోలవరం సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరిస్తామని నరేంద్ర మోదీ వారికి హామీ ఇచ్చారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇంతవరకు 345 కోట్లు ఇవ్వటంతో పాటు కేంద్ర అనుబంధ పద్దుల్లో మరో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని వారు నరేంద్ర మోదీకి వివరించారు. బిజెడి ఎంపీలు పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఈ వారం ప్రారంభంలో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించటం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు మూలంగా తమ రాష్ట్రంలో మల్కన్‌గిరి జిల్లాలోని పదిహేను రెవెన్యూ గ్రామాలు, పది చిన్న గ్రామాలలోని మొత్తం ఏడు వేల ఏడు వందల యాభై ఆరు హెక్టార్ల ప్రాంతం ముంపునకు గురవుతోందని బిజెడి ఎంపీలు ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. ముంపు మూలంగా దాదాపు ఆరు వేల మంది గిరిజనులతో పాటు మొత్తం ఏడు వేల మంది ప్రజలు నిర్వాసితులు అవుతారని వారు నరేంద్ర మోదీకి చెప్పారు. రాష్ట్రంలో కరవు నెలకొన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తమ రాష్ట్రానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు ప్రధానమంత్రిని కోరారు. ఒడిశాలోని కరవు ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రధానిని కోరినట్లు మహతాబ్ చెప్పారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు బీజీ పట్నాయక్‌ను భారతరత్న పురస్కారంతో సత్కరించాలని వారు నరేంద్ర మోదీని కోరారు. (చిత్రం) పోలవరం ప్రాజెక్టు(ఫైల్)