జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ను నిలదీయండి:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళాలు జరిపిన దాడుల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ సలహాదారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ మన జవాన్లను అవమానించటం కాంగ్రెస్ నైజంగా మారిందని విరుచుకుపడ్డారు. ఉగ్రదాడికి ధీటుగా మనం సమాధానం ఇవ్వటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజవంశానికి విశ్వసనీయుడైన వ్యక్తే ఒప్పుకున్నాడు అని అన్నారు. నవభారత నిర్మాణానికి కృషిచేస్తున్న తాము ఉగ్రవాదులకు వారి భాషలోనే తిరిగి బుద్ది చెప్పాం అని పేర్కొన్నారు. దేశ ప్రజలరా! మన జవాన్ల నైతిక స్థైర్యాన్ని కించపరస్తూ మాట్లాడేవారిని నిలదీయండి. వారికి తగినరీతిలో బుద్ధిచెప్పండని కోరారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఎన్నటికీ క్షమించబోమని వారికి అర్థమయ్యేరీతిలో చెప్పండి. జవాన్లకు ఈ దేశం ఎన్నటికీ అండగా వుంటుంది అని ఆయన స్పష్టంచేశారు.