జాతీయ వార్తలు

ప్రధాని ఏదైనా దాచటానికి ప్రయత్నిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేద్ర మోదీ హెలికాఫ్టర్‌లోని ఆయన లగేజీని తనిఖీ చేయటానికి ప్రయత్నించిన అధికారిని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయటాన్ని ఆప్, కాంగ్రెస్ పార్టీలు ట్విట్టర్ వేదికగా స్పందించాయి. ప్రధాని ఏదైనా దాచటానికి ప్రయత్నించారా అని పేర్కొన్నాయి. హెలికాఫ్టర్‌లో మోదీ ఏమి తీసుకువెళుతున్నారు. దాన్ని భారత్ చూడలనుకోవటం లేదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీనిపై బీజేపీ సైంతం ఘాటుగా స్పందించింది. ‘ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎస్పీజీ రక్షణలో ఉన్న వ్యక్తులకు సోదాల నుంచి మినహాయింపు ఉంది. ఆ మాత్రం కామన్‌సెన్స్ మీ పార్టీకి, మీ పార్టీనేతకు ఉండక్కర్లేదని నిరూపించారు. ఇది మరో సందర్భం’ అని అంటూ సమాధానం ఇచ్చింది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకులోని సంబల్‌పూర్ ఎన్నికల సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఆయన లగేజీని ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహసిన్ తనిఖీ చేయబోయారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆయనపై ఈసీ చర్య తీసుకుంటూ సస్పెండ్ చేసింది.