జాతీయ వార్తలు

ఓటమిని ఒప్పుకోలేక ఈవీఎంలపై నిందలా!:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ఓటమిని ఒప్పుకోలేక ఈవీఎంలపై నిందలు వేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ఈరోజు రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందంటే తాము కష్టపడ్డామని, ప్రజల విశ్వాసం పొందగలిగామని అన్నారు. కాని ఏనాడు తాము పోలింగ్ బూత్‌లను విమర్శించలేదని అన్నారు. ఈవీఎంలతో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగాయని, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలించాయని అన్నారు. ఈవీఎంలపై ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటుచేస్తే కేవలం రెండు పార్టీలు మాత్రమే వెళ్లాయని, వారు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ అంగీకరించలేకపోతుందని అన్నారు. బీజేపీ గెలిచినా దేశం ఓడిపోయిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించటంపై మోదీ మండిపడ్డారు. ఇటువంటివి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైనవి కావని అన్నారు. మరి వయనాడ్, రాయబరేలిలో ఏం గెలిచిందని ఆయన ప్రశ్నించారు.