జాతీయ వార్తలు

కొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నాం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ‘మెరుగైన రేపటి కోసం సంభాషణలు’ పేరుతో హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌‌లో ఆయన శుక్రవారం ప్రారంభోపన్యాసం ఇచ్చారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దాదాపు 15 కోట్ల మంది నివశిస్తున్న 112 జిల్లాల అభివృద్ధికి కంకణబద్ధులమయ్యామని అన్నారు. ఇందుకోసం కొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నామని, తమ హయాంలో ఖాళీ పేజీలు ఉండవని అన్నారు. ఈ ప్రాంతాల భవిష్యత్తు మెరుగుపడితే, భారత దేశ భవిష్యత్తు మెరుగవుతుందన్నారు.ఆరోగ్యం, విద్య, శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, బ్యాంకింగ్, బీమా, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు అనుసంధానం వంటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వీటన్నిటిపైనా ప్రత్యక్ష పర్యవేక్షణ జరుపుతామని తెలిపారు.