జాతీయ వార్తలు

మోదీ... జెఎన్‌యు వివాదంపై స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యు సంఘటనలు, రాజకీయ వివాదంపై మోదీ స్పందించాలని విపక్షాలు కోరాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విపక్ష నేతలతో మోదీ సమావేశమైనప్పుడు వారు ఈసూచన చేశారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ తాను ఒక పార్టీ నేతను కాదని, దేశానికి నాయకుడిగా తప్పనిసరిగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు. జెఎన్‌యులో జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక విద్యార్థి నాయకుడిపై దేశద్రోహం నేరం మోపి అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. క్యాంపస్‌లోకి పోలీసులు రావడం, విద్యార్థి అరెస్టుకు నిరసనగా విశ్వవిద్యాలయంలో ఆందోళన కార్యక్రమాలు ఊపందుకోవడం, ప్రతిగా మరో విద్యార్థిసంఘం నిరసనకు పూనుకోవడం, ఈ వివాదంలో వివిధ రాజకీయ పక్షాలు జోక్యం పెరిగిన నేపథ్యంలో ఈ సూచన చేశారు.