అంతర్జాతీయం

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 31: భారత్, స్పెయిన్‌లు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పర సహకారాన్ని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పెయిన్ ప్రధానమంత్రి మారియానోరజోయితో బుధవారం జరిగిన చర్చల సందర్భంగా మాట్లాడిన మోదీ ఉగ్రవాదాన్ని సంయుక్త ప్రయత్నాలతో ఎదుర్కోవల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ సమస్య ఇరుదేశాలకు భద్రతాపరమైన సవాల్ విసురుతోందని మాంక్‌లోవా ప్యాలెస్‌లో ఉదయం జరిగిన సమావేశంలో అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ స్పెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఒడిగట్టే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఇచ్చిన పిలునకు మరింత ప్రాధాన్యత లభించింది. ఐరోపా దేశాలు అన్నింటికీ కూడా స్పెయిన్ అత్యంత కీలకపైందికావడం వల్ల భద్రతాపరంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందంటూ ఇటీవల ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ ప్రధానితో తాము జరిపిన సమావేశం ఇరుదేశాల సంబంధాలకు బహుముఖ వికాసానికి ఎన్నో దారులు తీసిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సమావేశ వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. రజోయి సారధ్యంలో స్పెయిన్ విస్తృత స్థాయిలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని, తమ ప్రభుత్వం కూడా అత్యంత ప్రాధాన్యతారీతిలో ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తోందని మోదీ స్పష్టం చేశారు. రైల్వేలు, స్మార్‌సిటీలు, వౌలిక సదుపాయాల రంగాల్లో ఇరుదేశాలు మరింతగా సహకారాన్ని పెంపొందించుకోవాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. భారత్ అవసరాలను తీర్చగలిగే నైపుణ్యం, సామర్థ్యం స్పెయిన్‌కు ఉన్నాయన్నారు. తన పర్యటన అనేక రకాలుగా ఇరుదేశాల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంపొందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వివిధ రంగాల్లో విస్తృత సహకారం
భారత్, స్పెయిన్‌లు బుధవారం ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్ భద్రత, సాంకేతిక సహకారం, అవయవాల మార్పిడి, పునర్‌వినియోగం ఇంధనం, పౌరయానం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఈ ఒప్పందాల ద్వారా ఇరుదేశాలు అంగీకరించాయి. స్పెయిన్ అధ్యక్షుడు రజోయితో మోదీ చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరోపా యూనియన్ దేశాల్లో భారత్‌కు స్పెయిన్ ఏడో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు కలిగిన దేశంగా కొనసాగుతోంది. 2016లో ద్వైపాక్షిక వాణిజ్యం 5.27 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
నేడు పుతిన్‌తో మోదీ భేటీ
స్పెయిన్ ఒక రోజు పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్ ప్రధాని నరేంద్రమోదీ తదుపరి గమ్యమైన రష్యాకు బయలుదేరారు. తన పర్యటనకు స్పెయిన్‌లో మంచి ఆదరణ లభించిందని, ఆతిధ్యమూ లభించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత విస్తరించేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. రష్యాలో జరిగిన ఇరుదేశాల 18వ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతారు. జూన్ 2,3 తేదీల్లో ప్యారిస్ వెళ్తారు. ఆ దేశాధ్యక్షుడు మాక్రన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు.
చిత్రం: బుధవారం మాడ్రిడ్‌లో స్పెయిన్ ప్రధానమంత్రి మారియానోరజోయితో ప్రధాని నరేంద్ర మోదీ