జాతీయ వార్తలు

సంయమనం పాటించండి: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ : కావేరీ జల వివాదం ఫలితంగా కర్నాటక, తమిళనాడుల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప, పరస్పరం దాడులకు దిగడం మంచిది కాదన్నారు. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో కర్నాటకలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. కర్నాటకలో తమిళులపైన, తమిళనాడులో కన్నడిగులపైన దాడులు జరుగుతున్నందున శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదన్నారు.
పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం...
కాగా, బెంగళూరులో సోమవారం రాత్రి పోలీసుల కాల్పుల్లో మరణించిన ఉమేష్ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని కర్నాటక హోం మంత్రి పరమేశ్వర ప్రకటించారు. హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.