అంతర్జాతీయం

పాక్‌ను ఏకాకిని చేయాలని మోదీ కేబినెట్‌ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన భేటీలో మంత్రుల బృందం నిర్ణయించింది. కశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకాలపై సోమవారం ప్రధాని నివాసంలో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, మనోహర్‌ పారికర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్‌లోని యూరీ దాడిలో పాక్‌ హస్తం ఉందని చెప్పే ఆధారాలను అంతర్జాతీయ సమాజం ఎదుట ఉంచాలని నిర్ణయించింది. యూరీ మారణహోమంపై దర్యాప్తు చేసే బాధ్యతను ఎన్‌ఐఏకు అప్పగించారు.