జాతీయ వార్తలు

రేపు మోదీ మంత్రివర్గంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నట్టు భోగట్టా. ఈనెల 7న ప్రధాని మోదీ నాలుగు దేశాల్లో పర్యటించేందుకు వెళుతున్నందున ఈలోగా మంగళవారం నాడు క్యాబినెట్‌లో మార్పులు చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది యుపిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున మంత్రివర్గ విస్తరణలో ఆ రాష్ట్రానికి ఈసారి అధిక ప్రాధాన్యం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేసేందుకు కూడా మోదీ దృష్టి సారించారని చెబుతున్నారు.