మెయన్ ఫీచర్

ప్రచారంలో వెనుకబడిన మోదీ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ ఎన్నికలు ముగిసాయి. అవార్డు వాపసీ ప్రహసనం ముగిసింది. రాహుల్‌గాంధీ హుషారుగా ఉన్నా రు. కాంగ్రెస్ బలం 4నుంచి 24 వరకు బిహార్ అసెంబ్లీలో పెరిగింది. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారంతా. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను నాశనం చేస్తానని (ఉత్తర) ప్రగల్భాలు పలికాడు రాహుల్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. మళ్లీ కాంగ్రస్ రగడ ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తమను బిగించినందుకు న్యాయస్థానం మీది కోపం పిఎమ్‌మీద పార్లమెంట్ మీద చూపిస్తూ తమ స్కంధావారాల్ని రెచ్చగొట్టి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సైతం సరిగా జరగకుండా ప్రజోపకరమైన బిల్లులు పాస్ కాకుండా ప్రజాస్వామ్యాన్ని జన స్వామ్యానికి దిగజార్చుతున్న కాంగ్రెస్ పార్టీ పన్నాగం పసిగట్టలేని పిచ్చివాళ్లు కాదు ప్రజలు.
ఏకంగా తమ మామగారి మానస పుత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తులకే ఎసరు పెట్టిందంటే సోనియాగాంధీకి, కొడుక్కి మించిన గుండెలు తీసిన బంట్లు మరొకరుండరు. పైగా నెహ్రు 125వ జయంతుత్సవాలు చేస్తూ మోదీ ప్రభుత్వం ‘నెహ్రూ గౌరవాన్ని దిగజారుస్తున్నదని’ నిందించడం కాంగ్రెస్ మార్కు రాజకీయానికి అద్దం పడుతోంది. మోదీది ‘సూట్ బూట్ సర్కార్’ అని పదే పదే అబద్ధాలు పలికే రాహుల్‌కీ పార్లమెంటు సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుతో బాటు పేదలకు బోనస్‌ను రు.2500నుంచి రు.6000కు పెంచడం బోనస్ ఇచ్చినందుకు వేతన అర్హత పరిమితిని 7 వేలనుంచి 21 వేలకు పెంచడం వంటి అంశాలున్న కార్మిక సంక్షేమానికి సంబంధించిన బిల్లులు సభల ఆమోదం పొందాల్సి ఉందని తెలియదా? మరోపక్క కార్మికుల పిఎఫ్‌పై వడ్డీని పెంచేందుకు కూడా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పిఎఫ్ జమ చేయడంలో ఆలస్యం చేయవద్దని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దీనివల్ల కార్మిక ప్రయోజనాలతోపాటు పింఛను దారుల ప్రయోజనాలు దెబ్బతినడం జరుగుతుందని కేంద్రం భావించింది.
కేంద్రం ఒత్తిడి కారణంగా జాతీయ పింఛను పథకం బలపడి రాష్ట్రాలనుంచి సుమారు రూ. 50వేల కోట్లు జమ అయ్యాయి. తాము దోచుకునే కోట్ల గురించి తప్ప బీదలపాట్లు తెలియని ఆనందభవన్ ఉత్తరాధికారులకు జరుగుతున్న మార్పు గురించి ఏం అవగతమవుతుంది? మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేయాలని చూస్తున్నది. ఇందుకోసం ఓ కొత్త కొనుగోలు విధానాన్ని రూపొందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు తప్పక మరుగుదొడ్డి కలిగి ఉండాలని, హర్యానా ప్రభుత్వం చట్టం చేయడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు పేదలు మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు హర్యానా ప్రభుత్వం పలు పథకాల కింద సహాయం అందించడాన్ని సుప్రీంకోర్టు ప్రస్తుతించింది. ఇది స్వచ్ఛ భారత్‌లో భాగంగా బిజెపి నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం ఉద్యమస్థాయిలో చేపట్టిన చర్య. హర్యానాలో స్ర్తిలపై అత్యాచారాలు జరగడం ఎక్కువగా ఉన్న స్థితికి మూల కారణాన్ని ఛేదించేందుకు ఈ తరహా చర్యలు తప్పనిసరి అని హర్యానా ప్రభుత్వం భావించింది.
రవాణా రంగంలో పారదర్శకత కోసం కంప్యూటరీకరణ కోసం నూతన వాహన చట్టం తెచ్చి అవినీతిని అరికట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రయత్నిస్తున్నారు. ఇ-పాలన కోసం ప్రయత్నించడం తద్వారా సంపదను పెంచడం వివిధ సంక్షేమ పథకాల కోసమే కదా! ఈ బిల్లుకూడా గత ఏడాదిగా మోక్షానికి నోచుకోలేదు. వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేయడంలో ప్రభుత్వం అమలులో ఇబ్బందులను అధిగమించింది. ప్రపంచంలోని అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్ట్ఫికెట్ ఇచ్చింది. పహల్ పేరున మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని సంస్కరించి అమలు చేసింది. అదేవిధంగా గివ్‌ఇట్ అప్‌లో సబ్సిడీని వదులుకునేందుకు ప్రతిరోజు 2వేల మంది ముందుకు రావడం, కొత్తగా గాస్ పొందే లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకి పెరగడం, సామాన్యుడి జీవితంలో కాంతి నింపడం కాదా?
పేదల కోసం తెలంగాణకు ప్రభుత్వం కోరినన్ని ఇళ్లను కేటాయించినందుకు కెసిఆర్ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ప్రారంభించిన ‘అమృత’ గృహ నిర్మాణ పథకంలో తెలంగాణలోని 11 నగరాలు, పట్టణాలు ఉన్నాయి. 2022 వరకు అందరికీ ఇళ్లు సమకూర్చాలనుకున్న కేంద్ర పథకం సామాన్యుల కోసమే కదా! మరోపక్క దేశంలో పరోక్ష పన్నుల వసూళ్లు గత ఆరు నెలల కాలంలో 34 శాతం పెరిగాయి. విదేశీ పెట్టుబడులు 24 శాతం పెరిగాయి. సౌర విద్యుత్ సామర్ధ్యాన్ని 5 గిగావాట్లనుంచి 2022 నాటికి 100 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిస్ సదస్సులో అంతర్జాతీయ సౌర కూటమికి మోదీ చొరవతో అంకురార్పణ జరిగింది. గుర్‌గావ్‌లో ఈ కూటమి కేంద్ర నిర్మాణం జరుగుతుందని మోదీ ప్రకటించారు. సౌరశక్తిని పౌరశక్తిగా మార్చేందుకు దేశంలో 40 శాతం ప్రజలకు విద్యుత్ అవసరం తీర్చేందుకు చేసిన ఆలోచన వెనుక ఎంతో దార్శనికత ఉంది.
ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుల పాలిట శాపమైంది. ఉగ్రవాద వ్యవస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని మోదీ ఢిల్లీ విజ్ఞాన భవన్‌లో 31 దేశాలకు చెందిన అవినీతి నిరోధక, విజిలెన్స్ బ్యూరోల చీఫ్‌లను ఉధ్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఈ విషయంలో కోట్ల రూపాయల అక్రమ చలామణిని కేంద్రం నిలువరించింది.
మోదీ విమానాల్లో తిరుగున్నారని తాను పంట పొలాల్లో ఉన్నానని యుపిలో తాను పాల్గొన్న రైతుర్యాలీ నుద్దేశించి రాజీవ్‌గాంధీ అన్నారు. తాను గత సంవత్సరం 56 రోజులపాటు ఎవరికీ తెలియకుండా విదేశాల్లో ఒక ఎన్నికైన ప్రతినిధిగా వుండి తిరగడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. మోదీ దేశం పనిమీదనే విమానాల్లో విదేశాలకు తిరుగుతున్నారనేది అందరికీ తెలిసిందే! ప్రపంచంలో శక్తివంతమైన దేశాల నేతలు కూడా ఇలా విదేశీ యాత్రలు చేసి సంబంధాలు గట్టి పరచుకుంటారనేది వార్తల్లో ఉన్న విషయం. రష్యా అధ్యక్షుడు 41 దేశాల్లో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ 41 దేశాల్లో, ఒబామా 27 దేశాల్లో, చైనా అధ్యక్షుడు 27 దేశాల్లో తమ మొదట 16 నెలల పదవీ కాలంలో పర్యటించారు.
నల్లధనం విషయంలో కేంద్రం మళ్లీ హెచ్చరికలు చేసింది. అమెరికాతో చేసుకున్న ఒప్పందంవల్ల ఈ విషయంలో భారత్‌కు కొంత రహస్య సమాచారం అందుతునే ఉంది. 2017 వరకు ఈ విషయమై దోషులతో అమీ తుమీ తేల్చుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నది. భారత్ వ్యాపారం అనువుగా వున్న దేశాల సూచీలో 135 నుండి 130కి చేరింది. వ్యాపారం ప్రారంభించేందుకు కావలసిన వ్యవధిని 4 నెలలనుంచి నెలరోజులకు కుదించింది మోదీ ప్రభుత్వం. మేక్ ఇన్ ఇండియా, నైపుణ్య భారత్‌లవంటి వినూత్నమైన ఆలోచనల ద్వారా,విదేశీ పెట్టుబడుల ద్వారా వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని పెంచి నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఉస్తాద్ పథకం కింద మైనార్టీలు తమ పనితనం, నైపుణ్యం పెంచుకునే యోచన చేసారు. రైతులు 30శాతం నష్టపోయినా నష్టపరిహారం పొందే వెసులుబాటు ఉంది. డిజిటల్ ఇండియా, బుల్లెట్ ట్రైన్ వంటి యోచనలు భారత్‌ను సాంకేతికంగా ముందడుగు వేయిస్తాయి.
పరిశోధనలకు ఊతమిస్తూ ‘ఇంప్రింట్ ఇండియా’ కార్యక్రమం రూపొందించింది. యుపిఎ హయాంలో ఆగిపోయిన 4 లక్షల కోట్ల విలువైన వౌలిక వసతుల ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం మోక్షం కల్పించింది. వంద నగరాల్లో ఎల్‌ఇడి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో దాదాపు 21,500 మెగావాట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం కలిగింది. రైతుల పేరుతో యూరియాను పరిశ్రమలు దారి మళ్లించుకోవడాన్ని ఆపేందుకు యూరియాకు వేపపూత పూయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. విద్యుత్ లేని 18 వేల గ్రామాలకు విద్యుత్‌నిచ్చేందుకు కేంద్రం పని చేస్తోంది. వంద రోజుల్లో 3000గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా? ఇలా పథకాలెన్నున్నా మార్పు ఎంతవస్తున్నా ప్రచారం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం వెనుకబడింది. అందుకే ‘అసహనం’ పెరిగిందని, అర్ధం పర్ధంలేని అబద్ధపు ప్రచారం చేసి ప్రతిపక్షాలు బీహారులో పాగా వేసాయి. ‘అ‘ అంటే అవినీతి తప్ప ‘అభివృద్ధి’ అని భాష్యం చెప్పుకోలేని దివాలకోరు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. చివరకు పార్టీ విధానాలు పరువు సైతం బజారుపడేలా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కైంకర్యానికి బరి తెగించింది. ప్రజలే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.
మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తు న్నాయ. దేశవ్యాప్తంగా బలీయమైన మీడి యా సహకారంతో ప్రభుత్వంపై అయన కాడికి ఉన్నదీ లేనిదీ కల్పిస్తూ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నది. తాను చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేని మోదీ ప్రభుత్వ బలహీనతను కాంగ్రెస్ ప్రచార నైపుణ్యంతో తనకు అనుకూలంగా మలచుకొంటున్నది. ఎన్ని విజయాలు సాధించినా అవి ప్రజల్లోకి వెళ్లకపోతే ప్రభుత్వ మనుగడ కష్టం. పొంచి ఉన్న విపక్షాలు అసలు విష యాలను మరుగున పరచి లేనిపోనివి ప్రజల్లోకి తీసుకెళతాయ. ప్రస్తుతం జరుగు తున్నది అదే.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ సెల్: 9676190888