ఆంధ్రప్రదేశ్‌

ఏపీపై ప్రధాని మోదీ ప్రత్యేక శద్ధ : కేంద్రమంత్రి వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక శద్ధ చూపుతున్నారని, ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదదని , హోదాకు బదులుగా రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేకంగా గుర్తించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న వెంకయ్య భాజపా శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు. హోదాకు బదులుగా రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేకంగా గుర్తించిందని తెలిపారు. హోదా ఇస్తేనే పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు అనలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను ముందుగానే తొలగించామని చెప్పారు. రెండేళ్లలో పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చామని తెలిపారు.