సబ్ ఫీచర్

మూలం వేదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు మనం చూసే విజ్ఞానమంతా కూ డా ఇంతకుముందు మన ఋషులు దర్శించి మనకు వేదంలో నిక్షిప్త పరిచిన సమాచారమే. ప్రతి కొత్త వస్తువుఆనవాలు తరచి చూస్తే మనకు ఋషుల వచనంలో వారు సిద్ధాంతరీకరించిన సూత్రాల్లో నిబడీకృతమై ఉంది. ఉదా: జలంలో అగ్ని ఉంది అని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నిజమే. దానికి మూలం ఏమిటి అని ఆలోచిస్తే ‘అపోరాగ్ని’అన్నారు. అంటే నీటినుండి అగ్ని వచ్చింది. అంతేకాదు ‘‘అపో అయతనం వేదా అయతన వాన్ భవతి అని మంత్రపుష్పం లో ఉంది. అంటే మనబుద్ధికందని సైన్స్ ఎంతో ఉంది. అది అంతా మన మహర్షులు బోధించేవున్నారు. మనం ఆంగ్లవిద్యావ్యామోహం నుంచి బయటపడి మన సంస్కృత భాషను నేర్చుకుని కేవలం మార్కుల కోసం కాక నిజంగా సంస్కృతం చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం అనేవి చేస్తే కనుక మన వాజ్ఞయంలోనే ఎంతో గొప్పవిజ్ఞానం ఉంది. మహాభారతంలోనే గర్భస్థశిశువు ఎలా ఏర్పడుతుందో కూడా చక్కగా వివరించి ఉన్నారు. అసలు మన రామాయణ భారత భాగవతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇంతకుముందుకాలంలోగా ఈ గ్రంథాలను పాఠ్యపుస్తకాల్లో పాఠాలు గా చదివిస్తే పిల్లలకు చిన్నప్పటినుంచే విజ్ఞానం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తినే ఎన్నో పరిశోధనలకు మూలకందం అవుతుంది. కనుక ముందుగా సంస్కృత భాషను బతికించాలి. ఆ తరువాత మన వౌఖిక, లిఖిత వాఙ్మయాన్నంతా పిల్లలకు బోధించాలి. అట్లా చేయాలంటే ముందు పెద్దలంతా వాదావివాదాల్లోకి వెళ్లకుండా మన శాస్త్రాలు, పురాణాలు చెప్పే నిజాలేమిటో నిశితంగా పరిశీలించి తెలుసుకోవాలి. మూఢాచారాల పేరిట, అనాగరికత పేరిటో జరిగే విపరీత పరిణామాల్నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోగలం. దీనికి స్వార్థాన్ని కూడా విడనాడాలి. దీనికి కూడా వేదమే మార్గం చూపిస్తోంది. ప్రతి మనిషి సర్వేజనా సుఖినోభవన్తు అని తన కర్తవ్యాన్ని తాను ఆచరించాలి. నాలుగు వైపుల నుంచి మంచి భావనలు నన్ను చేరాలి అనుకోమని చెప్పే వేదాన్ని సునిశిత బుద్ధితో చదివి ఆకళింపు చేసుకోవాలి. అపుడే భారతదేశ ఔన్నత్యం దశదిశలా మారు మోగుతుంది.

చివుకుల రామమోహన్