కృష్ణ

భక్తులతో కిక్కిరిసిన మోపిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, మార్చి 13: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసింది. ఉదయం 6గంటల నుండి భక్తులు బారులుతీరి స్వామివారి నాగ పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. పాల పొంగళ్ళు, కేశఖండనలు, ఒడుగులు, చెవిపోగులు తదితర మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారి శాంతి కళ్యాణం ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంటు ఎ మధుసూదనరావు, అధికారులు విఎస్‌కె మల్లేశ్వరరావు, రామకృష్ణ భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళిన బూరగడ్డ అశోక్
మచిలీపట్నం , మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ పెడన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ బూరగడ్డ అశోక్ కుమార్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్‌లో పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి నేతృత్వాన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు వెళ్ళిన బృందంలో అశోక్ కూడా ఉన్నారు. ట్రైన్ ద్వారా ఢిల్లీకి వెళ్ళామని అశోక్ స్థానిక విలేఖర్లకు ఫోన్ ద్వారా తెలిపారు. 14, 15 తేదీలలో ఢిల్లీలో రాహుల్ గాంధి, సోనియా గాంధిలను కలుస్తామని వివరించారు. నియోజకవర్గం నుంచి కోటి సంతకాలలో భాగంగా సేకరించిన సంతకాలతో పాటు నీరు-మట్టిని కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళామని అశోక్ తెలిపారు.

వధూవర పరిచయ వేదికలను సద్వినియోగం చేసుకోవాలి - ఛైర్మన్ బాబా
మచిలీపట్నం, మార్చి 13: వివాహం కావాల్సిన యువతీ, యువకులు వధూవర పరిచయ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక గొడుగుపేట కొల్లిపరవారి కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య వధూవర పరిచయ వేదిక జరిగింది. శ్రీ లక్ష్మీనృసింహ సోమయాజి వైశ్య సమాజం కార్యదర్శి మాజేటి సీతాపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 432 మంది వరులు, 97 మంది వధువులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 28మంది వధూవరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసిడబ్ల్యుఎలో అఖిల భారత స్థాయిలో ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకున్న అప్పన నాగ వెంకట సాయి రామ్ తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొత్తగుండు రమేష్, సన్నిధి నాగసాయి శ్రీనివాస్, మహిళా విభాగ్ అధ్యక్షురాలు పసుమర్తి అనూరాధ, అన్నం బాల వెంకట రత్న ప్రసాద్, కార్యక్రమ అనుసంధాన కర్త ఊర సురేంద్రరావు, పాలకుర్తి సూర్యవరప్రసాద్ పర్యవేక్షించారు.