జాతీయ వార్తలు

బాధిత తల్లులు కన్నీటి స్పందనలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌పై ఒకప్పటి బాధిత తల్లిదండ్రుల కన్నీటి స్పందనలు కూడా ఉన్నాయి. సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాకు తన స్పందన తెలియజేస్తూ 17 సంవత్సరాల క్రితం తన కుమార్తె చనిపోయినపుడు కూడా ప్రజా స్పందన ఈ విధంగా ఉంటే తనకు సరైన న్యాయం జరిగేదని వాపోయారు. ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే భారతదేశ పుత్రిక అని ముద్ర వేసుకున్న నిర్భయ తల్లి సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేసింది. తాను గత ఏడేళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్నానని, తన కుమార్తె జీవితాన్ని అంతం చేసిన దుర్మార్గులకు ఉరిశిక్ష అమలు చేయించేందుకు ఇప్పటికీ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నానని వాపోయింది. నిర్భయ ఘటన తరువాత నా గాయాలకు ఎన్‌కౌంటన్ ఆయింట్‌మెంట్ పూసినట్లయిందని అన్నారు.