తెలంగాణ

మహాఒప్పందంతో ఎంతో మేలు : కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినపుడు ఎంత సంతోషం కలిగిందో గోదావరిపై ప్రాజెక్టుల విషయంలో ఇవాళ మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందం అంత ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహారాష్టన్రుంచి తిరిగివచ్చిన ఆయన బేగంపేట విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికిన శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రెండున్నర ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఆ తరువాత ఐదు జిల్లాల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం రైతులకు కలుగుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో ఎన్నో విమర్శలు చేసినవారికి ఈ ఒప్పందం ఒక పాఠమని చెప్పారు. సముద్రం పాలయ్యే గోదావరి నీటిని ఒడిసిపట్టుకుని ఈ ప్రాజెక్టుల ద్వారా సద్వినియోగం చేసుకోబోతున్నామన్నారు. మహారాష్టత్రో జరిగిన ఒప్పందం విషయంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావ్ పాత్ర అమోఘమని ప్రశంసించారు.