నల్గొండ

30 కోట్లతో సిఎం నివాసభవనం నిర్మించడం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, మార్చి 6: 30 కోట్లతో ముఖ్యమంత్రి కెసి ఆర్ నివాసభవనం నిర్మించడం అంత అవసరమా అని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ రాచరిక పాలనకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు. పూర్వం రాజుల వలె ప్రజల సొమ్ముతో కెసి ఆర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. పది సంవత్సరాల క్రితం నిర్మించిన క్యాంప్ కార్యాలయాన్ని కాదని మరో క్యాంప్ కార్యాలయం నిర్మించడం వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న కనీస జ్ఞానం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించి ఎఎఎస్ అధికారులకు ఇచ్చిన హెరిటేజ్ భవనాన్ని కెసిఆర్ కూలగొట్టించాడని, ఉస్మానియా ఆసుపత్రిని కూలగొడతానని, చెస్ట్ ఆసుపత్రిని కూలగొడతానని ఇలా రోజుకో ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రి కెసి ఆర్ చారిత్రక సంపదను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నాడని గుత్తా ఆరోపించారు. కెసి ఆర్ నియంతృత్వ పరిపాలనను అడ్డుకోవడానికి ప్రజాస్వామ్మవాదులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ కావాలన్న బలమైన ఆకాంక్షతో తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడినా ఉద్యమ పార్టీగా ఉన్న టి ఆర్ ఎస్‌కు 2014 ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని దీన్ని ఆసరాగా చేసుకొని జీవితాంతం తామే అధికారంలో ఉంటామన్న భ్రమలో టిఆర్‌ఎస్ నాయకత్వం ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అనేది ఉండొద్దన్న రీతిలో టిఆర్‌ఎస్ నాయకత్వం రాజకీయ వలసను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. టిఆర్‌ఎస్‌లో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయని, వరంగల్ జిల్లాలో కూడా కడియం, దయాకర్‌రావుల మధ్య గ్రూపు తగాదాలు మొదలయ్యాయని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో ఒకరి ఓటమి కోసం మరొకరు పని చేశారని అలాంటిది వీరంతా ఒకే పార్టీలో కలిసి పని చేస్తారని అనుకోవడం భ్రమేనన్నారు. విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి చిన్నాభిన్నంగా ఉంటే కెసిఆర్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఉన్న వాటిని కూల్చేయడం లేని వాటిని కట్టేందుకు యత్నిస్తున్నాడని సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరు : గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరూ ఇతర పార్టీలోకి వలస పోయే పరిస్ధితి లేదని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ నుండి సిఎల్‌పి నేత జానారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు టిఆర్‌ఎస్‌లో చేరతారని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ మీడియా సృష్టేనన్నారు. టిఆర్‌ఎస్‌లో ఇప్పటికే గ్రూపు తగాదాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, పిసిసి సభ్యుడు తేర గోవర్ధన్‌రెడ్డి, నగరపంచాయతి వైస్ చైర్మెన్ నల్లగాసు జాన్‌యాదవ్, వైస్ ఎంపిపి దూదిపాళ వేణూధర్‌రెడ్డి, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్‌నాయక్, చీదళ్ళ గోపి, కొండమల్లేపల్లి ఉప సర్పంచ్ కేసాని లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.