జాతీయ వార్తలు

మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. శివప్రసాద్ చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో 1951 జూలై 11న జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. తదనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచి సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం ఎంపీగా చిత్తూరు లోకసభ స్థానం నుంచి పోటీచేసి రెండుసార్లు గెలుపొందారు. ఎంపీగా ఆయన పలు కమిటీల్లో పనిచేశారు.

నటుడు..దర్శకుడు

స్వతహాగా రంగస్థల నటుడైన శివప్రసాద్ పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతి నాయకుడిగా వివిధ పాత్రలు పోషించారు. దూసుకెల్తా, తులసి, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు తదితర చిత్రాలలో నటించారు. ఇల్లాలు, కొక్కరొకో, ప్రేమతపస్సు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆకట్టుకునే వేషధారణలు

ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో విభిన్న వేషధారణలతో ఆయన రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా ఏపీ విభజన సమయంలోనూ, ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధన విషయంలో రోజుకొక వేషధారణతో వెళ్లి సభ్యులను ఆకట్టుకునేవారు.

చంద్రబాబు సంతాపం

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.