Others

మహిళా ఎంపీ ‘బైక్’ సవారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలిరంగు సల్వార్ కమీజ్.. నల్లటి చలువ కళ్లద్దాలు.. తలపై తెల్లటి హెల్మెట్ ధరించిన ఓ మహిళ అత్యంత ఖరీదైన ‘హేర్లీ డేవిడ్సన్’ బైక్‌పై రయ్‌మంటూ ఏకంగా పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉండగా బైక్‌పై వచ్చిన ఆ మహిళ ఎవరబ్బా? అని అక్కడున్న వారంతా ఒక్కసారి విస్మయం చెందారు. బైక్ సవారీ చేస్తూ వచ్చిన ఆ మహిళను చూసి అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారి కంగారు పడ్డారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా తనకు ఈ మాత్రం స్వేచ్ఛ ఉండొద్దా..!’- అన్నట్లు బైక్‌పై దూసుకొచ్చిన ఆ మగువ పేరు.. రంజీత్ రంజన్. 39 ఏళ్ల ఆమె బిహార్‌లోని సుపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆమె బైక్‌పై పార్లమెంటుకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బిహార్ రాజకీయాల్లో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందిన పప్పూ యాదవ్ (రాజేష్ రంజన్) భార్య అయిన రంజీత్ 2014లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో పుట్టిన ఆమె జమ్ము-కాశ్మీర్, పంజాబ్‌ల్లో చదివారు. టెన్నిస్ క్రీడాకారిణి అయిన ఆమెను పప్పూ యాదవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాశ్మీరీ పండిట్ అయినప్పటికీ పప్పూను వివాహం చేసుకునేందుకు ఆమె సిక్కు మతాన్ని స్వీకరించారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూనే ఆమె రాజకీయంగానూ సత్తా చాటుకుంటున్నారు. (చిత్రం) ఎంపి రంజీత్ రంజన్