క్రీడాభూమి

రేపు విశాఖలో ముంబయి ఇండియన్స్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ ఈ నెల 8వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో విశాఖపట్నంలో ఆడే తొలి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయ. రూ.400 నుంచి రూ.1,250 ధరతో లభ్యమయ్యే ఈ మ్యాచ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ‘బుక్‌మైషో.కామ్’ లేదా ‘ముంబయిఇండియన్స్.కామ్’ వెబ్‌సైట్ల నుంచి గానీ, లేక విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాక్స్ కౌంటర్ ద్వారా గానీ కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించారు. మహారాష్టల్రో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు మార్చిన విషయం విదితమే. దీంతో ముంబయి ఇండియన్స్ ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, 13వ తేదీ రాత్రి 8 గంటలకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 15వ తేదీ రాత్రి 8 గంటలకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తమ సొంత మైదానం (వాంఖడే స్టేడియం)లో ఆడాల్సిన మూడు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడనుంది.