సంజీవని

ముడతలు మాయం కావాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖంమీద ముడతలు చిన్నప్పటినుంచీ ఉండవు. వయసు పెరిగేకొద్దీ ఎండకు, గాలికి ఇతర వాతావరణ కారణాలవల్ల ముఖంమీద ముడుతలు చోటుచేసుకుంటుంటాయి. కండరాల కదలికలవల్లా ఈ ముడతలు వస్తుంటాయి.
ముఖం కదలికలు, భావాలను వ్యక్తం చేయడం కారణంతో పలుచటి ముఖ చర్మం ముడుచుకుని ముడతలుగా ఏర్పడతాయి. అలా వచ్చిన ముడతలు కాలక్రమేణా అలాగే నిలిచిపోతాయి.
ముఖ్యంగా నుదుటిమీద అడ్డంగా గీతలలా ఏర్పడతాయి. కనుబొమ్మల్ని పైకి లేపినప్పుడు అవి స్పష్టంగా కనిపిస్తాయి. రెండు కనుబొమ్మల మధ్య ముడతలు, నొసలు చిట్లించినపుడు స్పష్టంగా కనిపిస్తాయి. రెండు కళ్లకు అటు, ఇటు కూడా ముడతలేర్పడతాయి. నవ్వినపుడు ఇవి బాగా కనిపిస్తాయి. కనుబొమల క్రింద ముక్కుపైన ముడుతలు ముక్కుని చిట్లించినపుడు స్పష్టంగా కనిపిస్తాయి.
కొల్లేజాన్, జెర్మాఫిల్లర్, ప్రొటాన్ కొర్రిప్లెక్స్ లాంటివి మెత్తటి కణజాలంలోకి వెళ్లి ముడతలను సాఫీ చేస్తుంది. అయితే చికిత్సా సమయంలో నొప్పి ఉంటుందంటారు.
అందుకు చక్కటి పరిష్కారం ‘బొటక్స్’. ప్రొటీన్ల మిశ్రమం ఎక్కువ సైజు వున్న ముడతలుమీద కూడా పనిచేస్తుంది. స్వచ్ఛమైన బొటిక్స్ ముడతలు ఏర్పడటానికి కారణమయ్యే కండరాలను సాఫీగా ఉంచి యుక్తవయస్సులో వుండే తేజస్సును కలుగజేస్తుంది. శస్త్ర చికిత్స అవసరం లేని బొటక్స్ చిన్న ఇంజెక్షన్ ద్వారా ముడతల లోపలికి వెళ్లి సరిచేస్తుంది.
కనుబొమల మధ్యగల ముడతల్ని సరిచేయగల బొటక్స్ చికిత్సని అమెరికాకి చెందిన ఎన్‌డిఏ కూడా గుర్తించింది.
బొటక్స్ ముఖంలోని భావాలని పలికించే చిన్న చిన్న కండరాలను రిలాక్స్ చేసి చర్మాన్ని మృదువుగా వుంచి ముడతలు లేకుండా చేస్తుంది. ఒకసారి కండరాలు సడలి విశ్రాంతి స్థితికి వచ్చాక క్రమంగా కొత్త ముడుతలు రాకుండా ఉంటాయి.
చికిత్స అవసరమైన చోటే బొటక్స్ పనిచేస్తుంది. అదే దాని ప్రత్యేకత. కనుబొమలు లేపడానికి దోహదం చేసే కండరాలమీద బొటక్స్ ఎలాంటి ప్రభావమూ చూపదు. మిగతా ముఖభాగాలలో వ్యక్తమయ్యే భావాలు మామూలుగానే ఉంటాయి. ఎక్కడ అవసరమైతే బొటక్స్ అక్కడే పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. బొటక్స్ చికిత్సకు పది నిమిషాలు పడుతుంది. అందుకే దీన్ని లంచ్‌టైమ్ చికిత్స అంటారు. కొన్ని కొన్ని ఇంజెక్షన్లు ఇస్తే అన్ని ముడుతలు సరి అవుతాయి. కండరాలు నాలుగు నుంచి ఆరు మాసాల వరకూ అలాగే సడలి వుంటాయి. ఎలాంటి అసౌకర్యం నొప్పి ఉండదు. బొటక్స్ ఏ ప్రాంతంలో చేయాలనేది ప్లాస్టిక్ సర్జన్ నిర్ణయిస్తాడు. పూర్తిగా పనిచేయడానికి 15 రోజులు పడుతుంది. మధ్యలో చికిత్సని ఆపినా, అంతకుముందున్న ముడతలు తిరిగిరావు.

-డా.శశికాంత్ మద్దు ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ 9581258179