క్రీడాభూమి

ఆ బాధ్యత కూతురి పెళ్లితో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు మ్యాచ్ నిర్వహణపై ముకుల్ ముద్గల్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఒక టెస్టు మ్యాచ్‌ని నిర్వహించడం కూతురి పెళ్లి చేయడంతో సమానమని మాజీ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై రెండు దశల్లో విచారణ జరిపిన కమిటీకి ముద్గల్ చైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతను సమర్పించిన నివేదిక ఆధారంగానే సుప్రీం కోర్టు ఈ కేసులో కీలక నిర్ణయాలు ప్రకటించింది. శిక్షలను ఖరారు చేసే బాధ్యతను లోధా కమిటీకి అప్పగించింది. ఆ కమిటీ అన్ని కోణాల నుంచి ఈ కేసును పరిశీలించిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలను రెండేసి సంవత్సరాలు సస్పెండ్ చేసింది. అంతేగాక, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై మాజీ సిఇవో గురునాథ్ మెయప్పన్‌లపై జీవితకాల నిషేధాన్ని విధించింది. ఇలావుంటే, వివాదాలతో ముందుకు వెళుతున్న ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) తరఫున ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ముద్గల్ స్వీకరించాడు. మ్యాచ్ ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా జరుగుతుందని అతను సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌కి ఏర్పాట్లంటే ఆషామాషీ వ్యవహారం కాదని, అమ్మాయి పెళ్లికి మాదిరిగా చాలా ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. డిడిసిఎ అధికారులతో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు అతను నిరాకరించాడు. అంతా సవ్యంగా ఉందని, టెస్టుకు అన్ని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయని తెలిపాడు.

నేడు ఢిల్లీలో పటౌడీ స్మారకోపన్యాసం
న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం మంగళవారం ఇక్కడ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల క్రికెటర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్, ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తదితరులు కూడా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కీలకోపన్యాసం ఇస్తాడు. గత ఏడాది జరిగిన పటౌడీ స్మారకోపన్యాసాన్ని వివిఎస్ లక్ష్మణ్ ఇచ్చాడు.