ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ స్టేషన్‌లో ముద్రగడ బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్టు చేయడంతో తనను కూడా అరెస్టు చేయాలంటూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఆయన అనుచరులు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్థానిక పోలీసులు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు. తనపైనా కేసులున్నాయి గనుక తనను అరెస్టు చేయాల్సిందేనని ముద్రగడ భీష్మించుకుని కూర్చోవడంతో అమలాపురంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తుని విధ్వంసంలో మొదటి నిందితుడిని తానేనని ఆయన పోలీసులకు చెబుతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన అమాయకులను తక్షణం విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, ముద్రగడను అరెస్టు చేస్తే రాజకీయంగా పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే తప్ప ముద్రగడను అరెస్టు చేసే పరిస్థితి లేదు.