జాతీయ వార్తలు

ముంపు ప్రాంతాల నివేదికివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతిపై సర్కారుకు ఎన్జీటీ ఆదేశం
పర్యావరణ అనుమతుల కేసు 4కి వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 11: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి వరద ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎన్జీటీలో దాఖలైన కేసును శుక్రవారం విచారించిన ధర్మాసనం, తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వద్ద ఏపీ ప్రభుత్వం తరుపున ఏకె గంగోలి వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీమన్నారాయణ ఈ కేసు నిమిత్తం ఫేస్‌బుక్‌లో విరాళాలు సేకరించేందుకు ప్రయత్నించారని, కేసుకు దాదాపు రూ.53 లక్షలు ఖర్చువుతున్నట్టు పేర్కొన్నారని ఆరోపిస్తూ ఎన్జీటీలో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. పిటీషనర్ ఆంతర్యాన్ని అర్థం చేసుకుని కేసు కొట్టివేయాలని కోరారు. దీనిపై జస్టిస్ స్వతంత్రకుమార్ స్పందిస్తూ విచారణకు సంబంధంలేని అంశాలను పరిగణలోకి తీసుకొని కేసు కొట్టివేయలేమన్నారు. అలా చేసినందుకు పిటిషనర్ చేత క్షమాపణలు చేప్పిస్తామన్నారు. ఈ సందర్భంలో ఇప్పటివరకు చేసిన ప్రకటనలు వెనక్కి తీసుకుంటూ ధర్మాసనానికి, తన తరపు న్యాయవాదికి , ప్రతివాదులకు పిటిషనర్ శ్రీమన్నారాయణ క్షమాపణలు చెప్పారు. తరువాత దీనిపై వాదనలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో అమరావతి వరద ముంపు ప్రాంతాలను పేర్కొనలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది సంజయ్ ఫారిక్ వాదనలు వినిపించారు. దీనిపై ఎన్జీటీ ధర్మాసనం స్పందిస్తూ ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వకుండా కేసు విచారణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. నిర్మాణాలు పూర్తయ్యాక విచారణ చేపట్టి ఏంలాభమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వతరపు న్యాయవాది గంగూలి వాదనలు వినిపిస్తూ వందేళ్లకోసారి వరద వస్తోందని, ముంపు ప్రాంతాలకు కరకట్టలు నిర్మిస్తే ప్రమాదం ఉండదని వాదించారు. దీనిపై ట్రిబ్యునల్ స్పందిస్తూ ఇక్కడ కేవలం కరకట్టల నిర్మాణ అంశమే కాదని, పర్యావరణ అంశాలూ ఇందులో ఇమిడి ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణకు వరద ముంపు ప్రాంతాల నివేదికతో హాజరుకావలని ఆదేశిస్తూ, కేసు విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.