జాతీయ వార్తలు

ఎన్‌ఐఎ అధికారి హత్యకేసులో మునీర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి తాంజల్ అహ్మద్ హత్యకేసులో కీలక నిందితుడైన మునీర్‌ను యుపి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత ఏప్రిల్‌లో అహ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వస్తుండగా మునీర్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఫలితంగా అహ్మద్, ఆయన భార్య మరణించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మునీర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి హత్యకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. మరో రెండు హత్య కేసుల్లోనూ మునీర్ నిందితుడని పోలీసులు తెలిపారు.