రంగారెడ్డి

సిసి కెమెరా ఫుటేజీ ఆధారంతో.. మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 7: సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంతో మహిళ హత్య కేసును జీడిమెట్ల పోలీసులు చేధించారు. మహిళను బండరాయితో మోది దారుణంగా హతమార్చిన నిందితున్ని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల పిఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరల సమావేశంలో బాలానగర్ ఎసిపి నంద్యాల నర్సింహారెడ్డి, సిఐ చంద్రశేఖర్, డిఐ మహ్మద్ ఖాన్‌లు నిందితుని వివరాలను తెలిపారు. మెదక్ జిల్లా, టేక్‌మాల్ మండలం, ఎల్పుగొండ గ్రామానికి చెందిన చాకలి పోచమ్మ (59) చింతల్, మాణిక్యనగర్‌లో నివాసముంటూ ఆలయాల వద్ద బిక్షాటన చేసుకుంటూ జీవిస్తుంది. చింతల్, చెరుకుపల్లి కాలనీలో నివాసముండే మహ్మద్ షమీర్ (32) పాత నేరస్థుడు. పదకొండు వాహనాలను దొంగిలించిన కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. చింతల్‌లోని కల్లు కంపౌండ్‌కు రోజూ వెళ్లి కల్లు సేవిస్తుంటాడు. ఈనెల 2న రోజూమాదిరిగానే చింతల్ కల్లు కంపౌండ్‌కు చెల్లెలు లక్ష్మమ్మతో కలిసి పోచమ్మ వెళ్లింది. కంపౌండ్‌లో పోచమ్మకు, లక్ష్మమ్మకు మధ్య బేధాభిప్రాయాలు జరిగి మాటామాటా పెరిగింది. దానిని పసిగట్టిన షమీర్ పోచమ్మ దగ్గర ఉన్న ఆభరణాలను దొంగిలించాలనుకున్నాడు. లక్ష్మమ్మ తీసుకురమ్మని చెప్పిందని నమ్మబలికిన షమీర్ పోచమ్మతో పాటు ఐదు కల్లు సీసాలను, ఓ క్వార్టర్ మద్యాన్ని తీసుకుని చింతల్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక గల హెచ్‌ఎంటీ ఖాళీ ప్రదేశంలోకి పోచమ్మను తీసుకువెళ్లి కల్లులో మద్యం కలిపి పోచమ్మకు తాగించాడు. మద్యం మత్తులో పడి ఉన్న పోచమ్మ తలపై బండరాయితో షమీర్ మోది హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలను అపహరించాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మద్యం దుకాణంలో రికార్డ్ అయిన సిసి ఫుటేజీ ఆధారంగా షమీర్ మద్యం తీసుకున్నది గమనించి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. షమీర్ పోచమ్మను హత్యచేసింది తానేనని అంగీకరించాడు. రూ.25 వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగానే కేసును చేధించారని, ఆరు నెలల్లో నాలుగు కేసులను సిసి కెమెరాల ఆధారంగానే పురోగతిని సాధించినట్లు ఎసిపి నర్సింహారెడ్డి తెలిపారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అదుపుచేయడంతో పాటు జరిగిన నేరాలను త్వరలో చేధించామని చెప్పారు. సిఐ చంద్రశేఖర్, డిఐ మహ్మద్ ఖాన్, డిఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది నర్సింహులు, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, నర్సిరెడ్డి, కబీర్, శివానందం, అంజయ్య, శాంతకుమార్‌ను ఎసిపి అభినందించారు.