వరంగల్

నేడు నిట్ వేథికగా వరంగల్‌లో 5వ జాతీయ మహిళా సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 22: వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సు శుక్రవారం జరుగనుంది. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరుకావలసి వుండగా ఇంకా ఆయన పర్యటన మాత్రం ఖరారు కాలేదు. ఈ సదస్సులో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చైర్మన్ ఆర్.ముత్తుసుందరంతో పాటు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, మంత్రి అజ్మీర చందూలాల్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎంపిలు పసునూరి దయాకర్, అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, కలెక్టర్ వాకాటి కరుణ, టిఎన్‌జిఓస్ గౌరవ అధ్యక్షులు జి.దేవిప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ తదితరులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను చర్చించనున్నారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని టిఎన్‌జిఓస్ నాయకులు తెలిపారు. కాగా వరంగల్ నిట్ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగనుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం..
సాహిత్యాన్ని వివాదాస్పదం చేయొద్దు
*ప్రముఖ తమిళ రచయిత్రి అంబై సి.ఎస్.లక్ష్మి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 22: సాహిత్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదస్పదం చేయడం తగదని ప్రముఖ తమిళ రచయిత్రి అంబై సి.ఎస్.లక్ష్మి అన్నారు. శుక్రవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో రచన హక్కు, సాహిత్యంలో వివాదాస్పద సంస్కృతి అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కెయు సెనెట్ హాలులో ఆంగ్ల విభాగాధిపతి కె.దామోదర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మి మాట్లాడుతూ పుస్తకాలను నిషేధించడం, సెన్సార్ చేయడం, రచయితలు, కళాకారులపై దాడులు చేయడం, హత్యలు చేయడం వంటి చర్యలను ఆధునిక ఫాసిజంగా అభివర్ణించారు. సంస్కృతి పేరుతో సాహిత్యాన్ని అణచివేయడం, సాంస్కృతిక అరాచక వాదానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇండియన్ అకాడమి ఆఫ్ కామనె్వల్త్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ జి.సె.వి.ప్రసాద్ మాట్లాడుతూ సాహిత్యం వివాదాస్పదం కావడం సరైనది కాకున్నా సాహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు దోహదపడుతుందన్నారు. ఒక తరంలో వెలువడిన సాహిత్యంపై శతాబ్దాల తరువాత నిషేదం విధించాల్సి రావడం సమకాలిన సాహిత్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఎనిమల్ ఫామ్, అలిన్ ఇన్ వండర్ లాండ్ వంటి రచనలు నిషేదానికి గురికావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నైతికత, సామాజిక విలువలు, సంస్కృతి ఆసంప్రదాయాలు, మత సహనం వంటి తదితర సాకులతో రచనలను తొక్కిపెట్టే ప్రయత్నాలు భావ వ్యక్తికరణకు, సృజనాత్మకతను అణచివేయడమేనని అన్నారు. రచయితకు రచనా స్వాతంత్య్రం ఎంతో అవసరమని, అలాగే పాఠకునికి పఠనా స్వాతంత్య్రం కూడా ఉంటుందన్నారు. తాత్కాళికప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వివాదాస్పదం చేయడం మానుకోవాలన్నారు. ఐఎసిఎల్‌ఏఎల్‌ఎస్ కార్యదర్శి డాక్టర్ రీనారామ్‌దేవ్ మాట్లాడుతూ 1974 నుండి 600 మంది సభ్యులతోతమ సంస్థ సాహితీరంగ వికాసానికి కృషి చేస్తుందన్నారు. సదస్సు కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ దామోదర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సంస్కృతిక, వివాదాస్పద అంశాలకు సంబంధించిన సాహిత్యంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సమకాలిన సాహిత్యంలో వ్యవస్థీకృతమైన ఏ ఇతివృత్తాన్ని ప్రశ్నించినా వివాదస్పదం అవుతుందని అన్నారు. సదస్సులో సావనీర్‌తో పాటు ఆంగ్ల విభాగం వెలువరించే వార్షిక సాహిత్య జర్నల్, మరో మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె.పురుషోత్తం, డాక్టర్ సుబేంధు ముంద్, విశ్వజ్యోతిఘోష్, అంపశయ్య నవీన్, నరేంద్ర, శరతకుమార్‌రాజు, లక్ష్మణమూర్తి, రాజగోపాలచార్య, మల్లికార్జున్‌రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

-
ళనఆ

ఆథునిక టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలు

* అడిషినల్ డిసిపి యాకయ్య
నక్కలగుట్ట, జనవరి 22:సమాజంలో ప్రస్తుతం ఆధునికమైన సెల్‌ఫోన్ లాంటివాటితో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని అడిషినల్ డిసిపి యాకయ్య అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్బంగా విద్యార్థులకు అవగాహణ సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎసిపి వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యాకయ్య మాట్లాడుతూ యువకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అవసరమే, కాని దానిని అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోయిన యువకులు చాలా మంది ఉన్నారని తెలిపారు. అంతే కాక సెల్‌ఫోన్‌తో బాంబులను కూడా పేల్చవచ్చునని గుర్తుచేశారు.
టెక్నాలజీని యువకులు మంచికి వాడుకోవాలేగాని, చెడుకు వాడకూడదని వివరించారు. ఒక్క డిసెంబర్ మాసంలోనే 25మంది యువకులు చనిపోయారని, 74 మంది తీవ్ర గాయాలపాలైనారని వివరించారు. విద్యార్థులు చట్టాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. యువకులు రోడ్డు భద్రతను పాటిస్తే సగం రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలను తెలుసుకుని, బాధ్యతగల పౌరులుగా ఎదగాలని తెలిపారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, డాక్టర్ రమేష్‌రెడ్డి, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ కృష్ణయ్యలు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో
రైతు ఆత్మహత్య
జనగామ టౌన్, జనవరి 22: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామ మండలం పసరమడ్లలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పసరమడ్ల గ్రామానికి చెందిన రాగుల సిద్దులు(40) తనకున్న రెండెకరాల పొలంలో పత్తిచేను వేయగా వర్షాభావ పరిస్థితుల్లో పంట దిగుబడి సరిగా రాకా అప్పులపాలయ్యాడు. దీంతో కుటుంబంలో కలహాలు జరిగేవి. ఈ క్రమంలో సిద్దులు ఇబ్బందులను తట్టుకోలేక వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుటుంబ పెద్దదిక్కు పోయిందని, ముగ్గురు పిల్లల్ని ఎలా పోషించుకోవాలని భార్య లక్ష్మీ చేసిన రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి.
ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరగాలి
* వైద్యసిబ్బంది, అంగన్‌వాడీలు ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయాలి: కలెక్టర్ కరుణ
ఏటూరునాగారం, జనవరి 22: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతుల సంఖ్య పెరిగేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ వాకాటి కరుణ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఐటిడిఎ కార్యాలయంలో పిఒ అమొయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఐకెపి బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతుల సంఖ్య పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని పిహెచ్‌సిల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీటవేసి ఆర్థికంగా వెనుకాడకుండా ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా, ఎంతో నైపుణ్యం కలిగిన వైద్యులు, ఎఎన్‌ఎంలు ఉన్నప్పటికీ ప్రజలు ఖర్చుపెట్టి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు వెళుతున్నారని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతులసంఖ్య గణణీయంగా తగ్గిందని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేయడంవల్లేనని, అయినా వైద్య ఆరోగ్య సిబ్బంది ఎందుకు మేల్కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు ప్రసూతులకోసం వేలరూపాయలు ప్రైవేటు ఆసుపత్రులలో ఖర్చుచేయడం వల్ల అప్పులు కావడంకూడా ఒక కారణంగా పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి చేయించుకుంటే ప్రజలకు ఆరోగ్య భారంతోపాటు ఆర్థికభారం తగ్గుతుందని, ప్రోత్సాహకాలు లభిస్తాయని ప్రజలలో చైతన్యం కలిగించి, ప్రసూతికోసం ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చేలా చైతన్యపరిచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ,దీనికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రసూతుల సంఖ్య పెంచేందుకు ఎఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్ళి గర్భిణీల వివరాలు తీసుకోవాలని, ప్రసూతి అయ్యే తేదీలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చైతన్య పరచాలన్నారు. మేడారం జాతర అనంతరం తిరిగి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని,అప్పటి వరకు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య ఆర్డీ నాగేశ్వర్రావు, డిఎంహెచ్‌ఒ సాంబశివరావు, అడిషనల్ డిఎంహెచ్‌ఒ శ్రీరాం, డిసిహెచ్‌ఎస్ సంజీవయ్య, ఆర్డీఒ మహేందర్‌జీ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ దయానందస్వామి, సామాజిక వైద్యశాల సూపరిండెంట్ వాడె రవిప్రవీణ్‌రెడ్డి, ఎపిఒ వసంతరావు, ఐకెపి ఎపిడి రాజేంద్రప్రసాద్, జడ్పిటిసి ఎండి.వలియాబీసలీం, ఎంపిపి ఎస్కే.మెహరున్నీసా, సర్పంచ్ ఝాన్సీరాణిలతోపాటు మూడు మండలాల పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.
గూడ్స్ వ్యాగెన్‌లో పొగలు
డోర్నకల్, జనవరి 22: కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుండి కొండపల్లికి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలు వ్యాగెన్ నెంబర్ 131508లోని బొగ్గు అంటుకోవడంతో పొగలు వ్యాపించాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పొగలు గమనించిన కొందరు రైల్వే అధికారులకు తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సదరు గూడ్స్ రైలును వెంటనే అక్కడ నుండి పంపించి వేసారు.
కాటన్ జిన్నింగ్ మిల్‌లో అగ్నిప్రమాదం
*రూ.11లక్షల మేర నష్టం
లింగాలఘణపురం, జనవరి 22: మండలంలోని నెల్లుట్ల గ్రామ శివారులోని జెకెఎస్ కాటన్ జిన్నింగ్ మిల్‌లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం... జెకెఎస్ కాటన్ జిన్నింగ్‌మిల్ సమీప దూరంలోని ఓ వ్యవసాయ భూమిలో సాగుచేసిన పత్తిచేను కట్టెలను రైతు కాల్చుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు దానిలో నుంచి ఓ నివ్వురవ్వ గాలికి లేచి వచ్చి జిన్నింగ్ మిల్‌లో పడటంతో మిల్లులోని 50బేళ్లు(పత్తి కట్టలు)లతో పాటు కుళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు మిల్లు యాజమాన్యం తెలిపారు. ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బి. ఎల్లయ్య మాట్లాడుతూ జిన్నింగ్ మిల్‌లో అగ్నిప్రమాదం వల్ల రూ.11లక్షల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
సమస్యలను ఎదుర్కోవడంతోనే..
ఉన్నత శిఖరాలు
అదిరోహించవచ్చు
*స్వామి జ్ఞానానంద మహరాజ్
పర్వతగిరి, జనవరి 22: ప్రతి వ్యక్తి నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను స్వీకరించి వాటిని ఎదురించి ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలను అదిరోహించవచ్చని శ్రీ రామకృష్ణామట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ జ్ఞానానంద మహరాజ్ అన్నారు. శుక్రవారం పర్వతగిరి మండలంలోని ఆర్‌డి ఎఫ్ విద్యాసంస్థలో జరిగే సమావేశంకు హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ఎదురయ్యే సమస్యలను చూసి పారిపోకుండా ఎదురు తిరిగి ధైర్యం ఉన్నప్పుడే వారు జీవితంలో రాణిస్తారన్నారు. అదే విధంగా సమయ పాలన పాటించడం, క్రమశిక్షణను అలవర్చుకోవడం, పట్టుదలతో లక్ష్యాన్ని చేధించినప్పుడే ఉన్నత శిఖరాలను అదిరోహించవ్చని విద్యార్థులతో ముఖాముఖీగా మాట్లాడారు. అదే క్రమంలో పర్వతగిరి శ్రీ రామకృష్ణా సేవ సమితిని సందర్శించి కమిటి సభ్యులతో ముచ్చటించి ఆశిర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలురు మటం స్వామిజీ, జయరాంరెడ్డి స్వామిజీలు, అదే విధంగా ఆర్‌డిఎఫ్ సంస్థ హెచ్‌ఎం శ్రీ్ధర్, ఎర్రబెల్లి వసంతరావు, ఎర్రబెల్లి కమలాకర్‌రావు, రామకృష్ణా సేవా సమితి బాధ్యులు సురేందర్, కొలుగూరి నాగరాజు, మల్లికార్జున్, వివేకానంద, దయాకర్, సారంగపాణి, రేవంత్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.