జాతీయ వార్తలు

రహదారులకు నిధులివ్వండి కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఏపీలో తాగునీటి సరఫరాకోసం రూ.3150 కోట్లు కేటాయించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రోడ్డు నిర్మాణాలకు ప్రత్యేక నిధులను కేటాయించాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది.
బుధవారం ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో ఢిల్లీలో సమావేశమైయ్యారు. అనంతరం అయ్యన్న విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో పలు రాష్ట్ర రాహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా మల్కాన్‌గిరి-సీలేరును జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే నర్సీపట్నం-తుని, బంగారుమెట్ట-అనకాపల్లిని కూడా జాతీయ రహదారులుగా చేయాలని కోరమన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశమై రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత మంచి నీటి సరఫరా చేయడానికి రూ.3,150 కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. గతంలో ఉపాధి హామీ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించారని, ఈ ఏడాది అదనంగా మరో వెయ్యికోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.