జాతీయ వార్తలు

రాజీవ్ గాంధీ హత్య కేసు తమిళనాడు రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష పెడుతూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం, ఈ కేసులో మరణ శిక్ష పడిన ఎజి పేరారివేలన్ అలియాస్ అరివు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో నేరస్థులను విడుదల చేసే ముందు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2015లో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం, పేరారివేలన్ రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. అయితే ఈ రెండు పిటిషన్లు కూడా రివ్యూ పిటిషన్లను దాఖలు చేసుకోవడానికి ఉన్న ఆరునెలల గడువు దాటిన తర్వాత దాఖలు చేశారన్న కారణంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. విపరీత జాప్యానికి చూపించిన కారణాలు కూడా సంతృప్తికరంగా లేవని బెంచ్ అభిప్రాయ పడింది. ఈ కారణంపైనే పిటిషన్లను తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ రివ్యూ పిటిషన్లను, తీర్పును, దానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించామని, తీర్పును పునస్సమీక్షించాల్సిన అవసరం లేదనే నిర్ధారణకు వచ్చామని న్యాయమూర్తులు పిసి ఘోస్, ఎస్‌ఏ బోబ్డే, ఎఎం సప్రే, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

మంగళవారం బెంచ్ ప్రకటించిన ఈ తీర్పును బుధవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు.