జాతీయ వార్తలు

ఆధార్‌పై తీర్పు రిజర్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్ కార్డును తప్పనసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ఆదాయం పన్ను చట్టంలోని 139 ఎఎ సెక్షన్ చెల్లుబాటుపై దాఖలయిన ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, కోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ప్రతి రోజూ వాదనలు వింటూ ఉన్న విషయం తెలిసిందే. ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న ఆదాయం పన్ను శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ సిపిఐ నాయకుడు బినయ్ విశ్వమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే విషయంపై మరో రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. న్యాయమూర్తులు ఎకె సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బినయ్ విశ్వమ్ తోపాటుగా దళిత నాయకుడు బెజవాడ విల్సన్, రిటైర్డ్ ఆర్మీ అధికారి ఎస్‌జి వొంబట్‌కెరెలు దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తోంది.
ఆదాయం పన్ను చట్టంలో 399 ఎఎ సెక్షన్‌ను ప్రవేశపెట్టిన కారణంగా రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద పేర్కొన్న తన గోప్యతా హక్కుకు పూర్తి భిన్నంగా తాను ఆధార్ కార్డును తీసుకునేలా తనపై ఒత్తిడి చేస్తున్నారని బినయ్ విశ్వమ్ తన పిటిషన్‌లో వాదించారు.