జాతీయ వార్తలు

లైంగికంగా వేధిస్తూ వీడియో తీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్ (ఉత్తరప్రదేశ్), మే 28: ఉత్తరప్రదేశ్‌లో వ్యాపిస్తున్న చట్టరాహిత్యాన్ని ఎత్తిచూపే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్ జిల్లాలో పట్టపగలు కొంతమంది యువకులు ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఉదంతాన్ని వెల్లడించే ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సుమారు 12 నుంచి 14 మంది యువకులు ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడటం ఈ వీడియోలో కనిపిస్తోంది. తమను వదలిపెట్టాలని ఆ ఇద్దరు బాలికలు ఎంత వేడుకున్నా కనికరించని యువకులు వారిని కొట్టడంతోపాటు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పైగా ఏమాత్రం భయంలేకుండా వారు ఈ లైంగిక దాడి ఘటననంతా వీడియోలో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ యువకులు నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ వీడియో కనిపించారు. మరోవైపు, కలత చెందిన ఇద్దరు బాలికలు భయం భయంగా తమను వదలిపెట్టాలంటూ వారిని వేడుకుంటుండటం కనిపించింది. ఈ వీడియో ఆధారంగా నేరస్థులను గుర్తించిన పోలీసులు, వారిలోని ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మార్చిలో అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో బాలికల సంరక్షణ కోసం బహిరంగ ప్రదేశాలలో ఈవ్‌టీజింగ్‌ను నిరోధించడానికి ‘యాంటి రోమియో’ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.