రాష్ట్రీయం

నేడో రేపో నిజాం కాలేజీ ప్రొఫెసర్ ఖాసీం అరెస్ట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అభియోగంపై పోలీసులు నిజాం కళాశాల ప్రొఫెసర్ ఖాసీంను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్‌కు చెందిన మావోయిస్టు కొరియర్ శ్యాంసుందర్‌రెడ్డిని అరెస్టు చేసిన మెదక్ జిల్లా గజ్వేల్ పోలీసులు అతని వద్దనున్న కాల్ డేటా ఆధారంగా ప్రొఫెసర్ ఖాసీంకు కూడా మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఒకటి రెండు రోజుల్లో ఖాసీంను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. సాయిబాబాను విడుదల చేయాలంటూ పౌరహక్కుల సంఘం నాయకులు, విరసం నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో ప్రొఫెసర్ అరెస్టుకు పోలీసులు సిద్ధమవుతుండడం గమనార్హం.