రాష్ట్రీయం

నకిలీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే మల్లాదికి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 22: కల్తీ మద్యం మరణాల కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ పత్రాలు సకాలంలో జిల్లా జైలుకు చేరనందున విష్ణు విడుదల శనివారానికి వాయిదా పడింది. దీంతో పెద్ద సంఖ్యలో జైలు వద్ద తరలివచ్చిన పార్టీ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది. కృష్ణలంకలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన మద్యం సేవించిన ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ కేసులో విష్ణును తొమ్మిదో నిందితునిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సిట్ బృందం ఆయనను జనవరి 7దీన అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. మల్లాది జైలులో ఉండగానే.. కోర్టు అనుమతితో ఈనెల 14వ తేదీన తమ కస్టడీకి తీసుకున్న సిట్ బృందం నాలుగు రోజుల పాటు విచారణ అనంతరం తిరిగి 17వ తేదీన జైలుకు అప్పగించింది. బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదోపవాదాలు విన్న కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయలు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కండీషన్ బెయిల్ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.